Manadailynews

Manadailynews తెలుగు ప్రజల వార్త వారధి

సీతారామ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్.- హరీశ్ రావు కామెంట్స్సీతారామ ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక సమావేశా...
12/08/2024

సీతారామ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్.
- హరీశ్ రావు కామెంట్స్
సీతారామ ప్రాజెక్టు ప్రారంభ సన్నాహక సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ మంత్రులు నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటున్నారు.

మంత్రులు ఈ ప్రాజెక్టు కోసం క్రెడిట్ తీసుకునేందుకు మంత్రులు పోటీ పడుతున్నారు.

ఈ నెల 15 న సీఎం రేవంత్ క్రెడిట్ తీసుకునేందుకు ఇంకో ప్రయత్నం చేస్తున్నారు.

కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు ను తనకూ ఇష్టమైన పనిగా మొదలు పెట్టారు

ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేశారు

ప్రభుత్వం మారడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వచ్చింది

సీతారామ ప్రాజెక్టును అడ్డుకోడానికి కాంగ్రెస్ కోర్టులో కేసులు వేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కష్టాలు అధిగమించి పట్టుదలతో పూర్తి చేసింది.

ఈ రుజు మీకు రిబ్బన్ కటింగ్ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ప్రాజెక్ట్ కట్టినట్టి కటింటగ్ ఇస్తున్నారు.

ఇతరుల ఘతనను తమ ఘనతగా చెప్పుకునేవాళ్లను పరాన్నజీవులు అంటారు. కాంగ్రెస్ నాయకుల, ప్రభుత్వం తీరు అలాగే ఉంది.

75 కోట్లకే లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇచ్చామంటే నోబెల్ ప్రైజుకు ఇవ్వాలి.

మీరు ప్రారంభించిన మూడు పంపు హౌసు పనుల్లో పది పైసల పనన్నా మీరు చేశారా?

ప్రాజక్టు కట్టాలంటే డిజైన్, భూముల సేకరణ, అనుమతులకు ఏళ్లు పడుతుంది. మీరు ఏడు నెలల్లోనే పూర్తి చేశారా?

ప్రాజెక్టు దగ్గరికి రోజూ ఒక మంత్రి వెళ్తున్నారు. ఖమ్మం జిల్లాలో మంత్రులు పోటీ పడుతున్నారు. జనం మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు.

30 వేల ఉద్యోగాల తీరులాగే ఉన్నది సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరు.

మా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 95 శాతం పూర్తిచేసింది.

బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్, పరీక్షలు అన్నీ పూర్తి చేసి నియామకాల దగ్గరి ఆగిపోయింది. కాంగ్రెస్ నియామాకాలు చేసి తన ఘనతగా చెప్పుకుంటోంది.

మేం నిర్మించిన ఫ్లైఓవర్లను, ప్రాజెక్టులను ప్రారంభిస్తూ, మేం తెచ్చిన బస్సులకు జెండాలుపుతూ, మేం అమలు చేసిన పథకాలకు చెక్కులు పంచుతూ కాలం గడపుతున్నారు.

కేసీఆర్ ఆనవాలు చెరిపేస్తామని అంటున్నారు. మీ తండ్లాట, మీ తాపత్రయమే నీ నైతిక పతకానికి సంకేతం.

సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్‌దే అని చెప్పిన మంత్రి తుమ్మల ఇప్పుడు అదే మాట గుండెలపైనే చెయ్యేసుకుని చెప్పాలి.

సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కల. కృష్ణా నీళ్లు రాకపోవడంతో గోదావరి నీళ్లను ఒడిసిపట్టి ఖమ్మం జిల్లాను మొత్తం రెండు పంటలతో సస్యశ్యామలం చేయాలనుకున్నారు.

రాజీవ్, ఇందిరా సాగర్‌లలో మీరు 3వేల సామర్థ్యం పెట్టగా కేసీఆర్ 9 వేల క్యూసెక్కులకు పెంచారు.

వందేళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్నారు.

ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్టును మేం కట్టామంటున్నారు. ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్లో 8 ప్యాకేజీల్లో 5 మేం పూర్తిచేశాం.

మిగతా మూడింటిలో 80 శాతం పని పూర్తయిం. మోటార్లు, పంప్ హౌసుల నిర్మాణం బీఆర్ఎస్ హయాంలో జరిగిందే.

మీరు నెత్తిమీద నీళ్లు చల్లుకుని పాపపరిహారం చేసుకుంటున్నారు.

ప్రాజెక్టు పేరే సీతారామ ప్రాజెక్టు.. రాముడు సత్యవాక్పరిపాలకుడు. సత్యానికి, ధర్మానికి ప్రతిరూం.

ఆయన పేరుపై కట్టిన ప్రాజెక్టు అబద్దాలు చెప్తే ఆ భగవంతుడు కూడా క్షమించడు.

ఇతరుల ఘనతను మీదిగా చెప్పుకునే భావదారిద్ర్యం నుంచి మీరు బయటపడాలి. పేరు కోసం ఇంత దిగజారాలా?

మీరు 2005 నుంచి 2014వరకు మీరు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు కనీసం అనుమతులు కూడా తీసుకురాలేదు. భట్టివిక్రమార్క అప్పుడు కూడా కేబినెట్ హోదాలో ఉన్నారు.

ప్రాజెక్టును మేం రైతుల అవసరాల కోసం రీడిజైన్ చేసుకుని ఆయకట్టును 3 లక్షల ఎకరాల నుంచి 6 లక్షల 74వేల ఎకరాలకు పెంచాం.

27 నుంచి 67 టీఎంసీలకు నీటి సామర్థాన్ని పెంచుకున్నాం. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ తదిరర ప్రాంతాలకు ఆయకట్టుకని విస్తరించాం. మూడువేల చెరువులకు నీళ్లిచ్చే ప్రయత్నం చేశాం.

కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చారు. కర్ణాటక, మహారాష్ట, ఏపీ అనుమతులు కూడా తీసుకొచ్చాం.

గోదావరి నీళ్లు పాలేరు దాకా వస్తాయి. అక్కడ రివర్స్ పంపింగ్ చేస్తే నల్లగొండ జిల్లాకు కూడా నీళ్లు వస్తాయి.

చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే పాలేరు బ్యాక్ వాటర్స్ ద్వారా నల్లగొండ జిల్లాకు సీతారామ ప్రాజెక్టు తో గోదావరి జలాలను అందించేటట్టు జాగ్రత్తలు తీసుకున్నాం

ఎంతో ముందు చూపు తో కేసీఆర్ ఈ సీతారామ ప్రాజెక్టు ను ప్రతిపాదించారు

సీతారామ ప్రాజెక్టు ప్రారంభం ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరఫున పండగ నిర్వహించుకుందాం.

ప్రజల ఆనందమే బీఆర్ఎస్ ఆనందం. మాకు భేషజాలు లేవు.

మీ పరిపాలన ఆగమాగమైంది. గ్రామాల్లో పారిశుధ్యం లేక జనం రోగాల బారిన పడుతున్నారు.

8 నెలల బాబు కూడా డెంగీతో చనిపోయాడు. మూడు వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. పసికందులను కుక్కలు పీక్కుతింటున్నాయి.

హాస్టళ్లలో భోజనం కలుషితం అవుతోంది.
వైన్ షాపులకు టార్గెట్లు పెట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదు.

ఇప్పటికైనా పబ్లిసిటీ స్టంట్స్ మాని సంక్షేమంపై దృష్టి పెట్టండి.

నెలరోజుల్లో కృష్ణమ్మ హారతి పున:ప్రారంభం:దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిఅమరావతి:గోదావరి-కృష్ణా సంగమ ప్రాంతమైన పవిత...
12/08/2024

నెలరోజుల్లో కృష్ణమ్మ హారతి పున:ప్రారంభం:దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
అమరావతి:గోదావరి-కృష్ణా సంగమ ప్రాంతమైన పవిత్ర సంఘమం(ఇబ్రహీంపట్నం) ఫెర్రీ వద్ద నెలరోజుల్లోగా కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని పున:ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.ఈమేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో కృష్ణమ్మ హారతి కార్యక్రమం పున:ప్రారంభానికి సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం(జిఓఎం)సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ గతంలో సియం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవిత్ర సంఘమం వద్ద కృష్ణమ్మ హారతిని ఒక పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిత్యం నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు.అయితే గత ఐదేళ్ళ కాలంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మరలా కృష్ణమ్మహారతిని నెల రోజుల్లోగా పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కావున కృష్ణమ్మ హారతి నిర్వహహణకు గాను పవిత్ర సంఘమం-ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద అవసరమైన కనీస మౌలిక సదుపాయాలైన రహదార్లు,విద్యుత్,బస్సు రవాణా,పారిశుద్ధ్య నిర్వహణ వంటి సదుపాయాలను పూర్తి స్థాయిలో పునరుద్దరించేందుకు సంబంధిత శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు.ముఖ్యంగా ఎన్టిఆర్ జిల్లా యంత్రాంగం,జలవనరులు,సిఆర్డిఏ,దేవాదాయశాఖ,దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం,పోలీస్, ట్రాన్సుకో,మున్సిపల్ తదితర శాఖల అధికారులు వారి స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించుకుని తగు చర్యలు చేపట్టాలన్ని మంత్రి ఆదేశించారు.
రానున్న రోజుల్లో పవిత్ర సంఘం వద్ద కేవలం కృష్ణమ్మ హరతికే పరిమితం కాకుండా ఆప్రాంతాన్ని ఒక పవిత్ర ఆధ్యాత్మిక మరియు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆదిశగా తగిన చర్యలు తీసుకోనున్నట్టు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.ఇందుకు సంబంధించి ఏర్పాటైన మంత్రుల కమిటీ తొలి సమావేశం జరిగిందని అధికారుల స్థాయిలోను,జిల్లా యంత్రాంగం స్థాయిలోను సంబంధింత శాఖల అధికారులతో మరిన్ని సమావేశాలు నిర్వహించి త్వరిత గతిన కృష్ణమ్మ హారతిని పున:ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాజమహేంద్రవరంలో గోదావరి హారతి ప్రస్తుతం కొనసాగుతోందని దానిని మరింత పటిష్టవంతంగా నిర్వహించేందుకు కూడా త్వరలో చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఈసమావేశంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,గృహ నిర్మాణ శాఖామాత్యులు కె.పార్ధసారధి మాట్లాడుతూ కృష్ణమ్మ హారతి అనేది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమమని దానిని నెలరోజుల్లోగా పున:ప్రారంభించేందుకు చర్యలు తీసుకోడం జరుగుతుందని తెలిపారు. అక్కడ టిటిడి లేదా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆప్రాంతాన్ని రాష్ట్రానికే ఒక ప్రముఖ పర్యాటక,ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారు.అక్కడకు వచ్చే పర్యాటకులు,భక్తులు తదితరులకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని ఆదిశగా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.కృష్ణమ్మ హారతి కార్యక్రమాన్ని పునరుద్దరించడంతో పాటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక ఫ్యాకేజి టూర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పార్ధసారధి సూచించారు.
దేవాదాయశాఖ కమీషనర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ 2016 నుండి పవిత్ర సంఘమం వద్ద కృష్ణమ్మ హరతి నిర్వహించబడేదని కొవిడ్ అనంతరం నిర్వహించలేదని చెప్పారు.దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వద్ద ప్రతి రోజు నిత్య జలహారతిని దేవస్థానం నిర్వహిస్తోందని తెలిపారు.మరలా కృష్ణమ్మ హరతి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందును అందుకు సంబంధించిన ఏర్పాట్లను యుద్ద ప్రాతిపదికన చేపట్టాల్సి ఉందని కావున సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఎన్టిఆర్ జిల్లా కలక్టర్ సృజన మాట్లాడుతూ ఇప్పటికే పవిత్ర సంఘమం,ఇబ్రహీం పట్నం ఫెర్రీవద్ద జంగిల్ క్లియరెన్సు పనులను చేపట్టడం జరిగిందని చెప్పారు.విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇఓ రామారావు మట్లాడుతూ కృష్ణమ్మ హారతి నిర్వహణకు 6పంట్లు,10 సెట్ల హరతులు అవసరం ఉందని చెప్పారు.అదే విధంగా మంచి సౌండ్ సిస్టమ్ తోపాటు 13 మంది అర్చకులు వారికి సహయకులుగా మరో 20 మంది సిబ్బంది అవసరం ఉందని అన్నారు.ఇంకా పోలీస్,సిఆర్డిఏ,ట్రాన్సుకో,ఐఅండ్ పిఆర్,అగ్నిమాపక,మున్సిపల్,పర్యాటక తదితర విభాగాల తరపున చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులు వివరించారు.
ఇంకా ఈసమావేశంలో డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ మురళి, విజయవాడ పశ్చిమ డిసిపి టి.హరికృష్ణ,ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Chief Secretary Santhi Kumari visited Golkonda Fort today and inspected the arrangements being made for the Independence...
12/08/2024

Chief Secretary Santhi Kumari visited Golkonda Fort today and inspected the arrangements being made for the Independence Day celebrations. She directed the officials to make fool proof arrangements in a befitting manner.
The main attraction during this Independence Day celebrations would be the large participation of cultural troupes who would be participating in their traditional attires depicting the rich and varied cultural heritage of the state. According to the Director of Culture Harikrishna, more than one thousand artists from different art forms such as Gussadi, Kommu Koya, Lambadi, Dappulu, Oggu dollu, Kolatam, Bonalu Kolatam, Bhaindla Jamidikal, Chindu Yaksha Gaanam, Karrasaamu, Kuchipudi, Bharatnatyam, Perni, Nagara Bheri would participate in the Independence Day celebrations. It was also decided to bring school children from various schools so as to kindle the spirit of patriotism amongst the children.
Chief Secretary instructed the police department to make proper bandobust, security and traffic arrangements so as to avoid inconvenience to the public. All the line departments were told to work in close coordination to organise the event in a grand manner.
DGP Jitender, Special Chief Secretary Vikas Raj, Director Protocol Vernkat Rao, CIPR Hanumantha Rao and other officials were present on the occasion.

రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఈ ర...
12/08/2024

రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఈ రోజు ఏలూరులో ప్రారంభమైంది. గత ప్రభుత్వం రైతులకి రూ.1674 కోట్లు బకాయి పెట్టిందని శ్రీ మనోహర్ గారు తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే రూ. వెయ్యి కోట్లు బకాయి చెల్లించినట్లు స్పష్టం చేశారు. మిగిలిన రూ.674 కోట్లు ఈ రోజు విడుదల చేశామన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించారు.

12/08/2024

త్వరితగతిన తుంగభద్రా నది గేటు రిపేర్ చేస్తున్న సిబ్బంది.

12/08/2024

మానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ
ఫిర్యాదు ఇవ్వడానికి అర్ధరాత్రి స్టేషన్‌కి వచ్చిన బాధితురాలికి తీవ్ర అస్వస్థత.
తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించిన సీఐ.
అన్నమయ్య జిల్లా మదనపల్లె వన్ ‌టౌన్ సీఐ చాంద్‌బాషాని అభినందించిన పోలీస్ శాఖ.

12/08/2024

బంగ్లాదేశ్ లో హిందువులు నివసించే హాస్టళ్లపైన వ్యాపార సముదాయాలు పైన దాడులు చేస్తూ వాటిని దగ్ధం చేస్తున్న బంగ్లాదేశ్ ముస్లింలు.

విదేశీ విద్య సాయం అందించండి*ఆటో కార్మికుల కోసం ఎంఎస్ఎమ్ఈ ఆటో పార్క్ ఏర్పాటు చేయాలి*24వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్...
12/08/2024

విదేశీ విద్య సాయం అందించండి
*ఆటో కార్మికుల కోసం ఎంఎస్ఎమ్ఈ ఆటో పార్క్ ఏర్పాటు చేయాలి
*24వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు తరలివచ్చిన ప్రజలు
*పలు సమస్యలపై తక్షణ పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు
అమరావతి : కష్టాల్లో ఉన్నామంటే చాలు..క్షణం ఆలోచించకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. ఉండవల్లిలోని నివాసంలో 24వ రోజు “ప్రజా దర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తుల తక్షణ పరిష్కారానికి సిబ్బందికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో తమ కష్టాలు విన్నవించుకునేందుకు “ప్రజాదర్బార్” కు వచ్చిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

*ఆటో కార్మికుల కోసం ఎమ్ఎస్ఎమ్ఈ ఆటో పార్క్ ఏర్పాటుచేయాలి*

ఆటో కార్మికుల సంక్షేమం కోసం మంగళగిరిలో ఎమ్ఎస్ఎమ్ఈ ఆటో పార్క్ ఏర్పాటు చేయాలని మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. మంచానికే పరిమితమైన తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన పిల్లి శివమ్మ విజ్ఞప్తి చేశారు. భర్త లేని తాను ముగ్గురు పిల్లలతో 26 ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నానని, ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరుకు చెందిన చింతలచెర్వు మరియమ్మ కోరారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందనే నెపంతో గత ప్రభుత్వం తొలగించిన దివ్యాంగ పెన్షన్ పునరుద్ధరించాలని తాడేపల్లికి చెందిన ఎన్.కేశవరావు విజ్ఞప్తి చేశారు. హత్యకు గురైన తన సోదరుడి డెత్ సర్టిఫికెట్ మంజూరుకు ఆదేశాలు ఇవ్వాలని తాడేపల్లికి చెందిన జి.ప్రసాదరావు కోరారు. ఎంసీయే చదివిన తనకు ఉద్యోగం కల్పించాలని మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడికి చెందిన జే.మానస విజ్ఞప్తి చేశారు. ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

*విదేశీ విద్య సాయం అందించండి*

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో జరిగిన భూఅక్రమాలపై విచారణ చేసి సామాన్యులమైన తమకు న్యాయం చేయాలని విశాఖ జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లికి చెందిన కే.అప్పారావు, కే.శ్రీను, కే.అప్పలరాజు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వంశపారం పర్యంగా తమకు సంక్రమించిన భూములను గత ప్రభుత్వ అండతో వైసీపీ నేతలు కబ్జా చేశారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరిపించి కబ్జాదారులను తరిమికొట్టాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. విదేశీ విద్య పథకం కింద కెనడాలో చదువుతున్న తమ కుమారుడికి ఆర్థికసాయం మంజూరు చేయాలని ఏలూరు జిల్లా బాపిరాజుగూడెంకు చెందిన బి.శ్రీనివాసరావు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. అన్ని అర్హతలు ఉన్న తనకు గత ప్రభుత్వం హోంగార్డు ఉద్యోగం కల్పిస్తామని ఆశ చూపి వంచించిందని, తగిన న్యాయం చేయాలని కాకినాడ జిల్లా సూరంపాలెంకు చెందిన నల్లల మణికంఠ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంకు చెందిన నల్లల త్రిమూర్తులు అనే రైతు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో సేంద్రియ పద్ధతిలో సాగుచేసి, 150 బస్తాలకు పైగా ఉండే తన ధాన్యపు కుప్ప దగ్ధమై ఆపారనష్టం సంభవించిందని కన్నీటి పర్యంతమయ్యారు. నష్టపరిహారం కోసం గత ప్రభుత్వ హయాంలో అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. తన విజ్ఞప్తిని పరిశీలించి నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. తిరుపతి జిల్లా గూడురు మండలం రెడ్డిగుంటలో తాను కొనుగోలు చేసిన 1.61 ఎకరాలకు పాస్ బుక్, పట్టా ఇప్పించాలని మెండా రామచంద్రయ్య విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యసేవలు అందించిన తమను 2021 సెప్టెంబర్ లో ఉద్యోగాల నుంచి తొలగించారని, తగిన న్యాయం చేయాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. లివర్, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన భర్తకు మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని విజయవాడ పోరంకి గ్రామానికి చెందిన షేక్ ఆయేషా మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ అండతో ఇంటి స్థలాన్ని కబ్జా చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ నేత నాదెండ్ల చంద్రమౌళిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పెరుమాళ్ల మోహన్ రావు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. నాదెండ్ల చంద్రమౌళి, అతడి తండ్రి నాదెండ్ల సుబ్రహ్మణ్యం రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎకరాల అసైన్డ్, దేవాలయ భూములు కూడా కాజేశారని ఫిర్యాదు చేశారు. ఇరువురి భూఅక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడికి పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఒంగోలుకు చెందిన బి.వెంకాయమ్మ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు
Nara Lokesh Nara Lokesh Army Nara Chandrababu Naidu Nara Lokesh Mangalagiri Nara Lokesh Follower Nara Lokesh Sena

విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కూటమి.ఈనెల 30న ఎమ్...
12/08/2024

విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కూటమి.
ఈనెల 30న ఎమ్మెల్సీ ఎన్నిక.
అన్ని విధాల బలమైన అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి
2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశించిన బైరా.
వైసీపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్న బొత్స సత్యనారాయణ.
బొత్సను ఢీకొననున్న బైరా దిలీప్ చక్రవర్తి.

సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకూడదు*గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలన్నదే మా తపనడిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పంచాయతీలు, సర్పంచుల వ్యవస...
12/08/2024

సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకూడదు
*గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలన్నదే మా తపన
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థ బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కీలకమైన గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలన్నదే తమ ప్రభుత్వ తపన అని తెలిపారు. గ్రామ సభల నిర్వహణ, జల్ జీవన్ మిషన్ నిధుల వ్యయంపై పల్స్ సర్వే చేస్తున్నామన్నారు. స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంచామన్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం రాష్ట్రంలోని 13 వేల 326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామాల్లో ఏ పనులు చేయాలి? ఎలాంటి పనులకు ఆమోదం తెలపాలన్న విషయాల్ని గ్రామ సభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము చేపట్టే పనుల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు పెరుగుతాయని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులతో కలిసి సభ జరుగుతుందని వెల్లడించారు.

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇస్తామన్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డులు చెబుతున్నా, వాటి ఫలాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించటం లేదని ఆరోపించారు. పథకం లక్ష్యాలకు అనుగుణంగా పనులెక్కడా జరగలేదన్నారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధులు, జరగాల్సిన పనులను ముందుకు తీసుకెళ్లటంపై పల్స్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.

*జెండావందనం పండగలా చేయాలి:* 34 ఏళ్ల క్రితం గ్రామాల్లో స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ వేడుకల జరిపేందుకు ఇచ్చిన జీవోను మార్చి కొత్తగా నిధులు పెంచుతూ జీవో విడుదల చేశామని తెలిపారు. జెండావందనం గ్రామగ్రామానా సంబరంగా పండుగలా చేయాలని సూచించారు. 5 వేల జనాభా కంటే తక్కువగా పంచాయతీలకు రూ.100లు నుంచి రూ.10 వేలకు, 5 వేల జనాభా దాటిన పంచాయతీలకు రూ.250లు నుంచి రూ.25 వేలకు పెంచినట్లు వివరించారు. సర్పంచులు సగర్వంగా గ్రామంలోని అందరినీ పిలిచి మరీ జెండా పండుగను నిర్వహించుకునేలా వారికి కూటమి ప్రభుత్వం నిధులను ఇస్తోందన్నారు. చేనేత కళాకారులు నేసిన జెండాలనే వినియోగించాలని పిలుపునిచ్చారు.

*సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా చూస్తాం:* ఏ దశలోనూ ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలల పిల్లలకు జెండా పండుగ విశిష్టత తెలిసేలా వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, డిబేట్, క్రీడా పోటీలను నిర్వహించి వారికి బహుమతులు అందజేయాలని సూచించారు. ఎలాంటి ప్లాస్టిక్ జెండాలు, ఇతర పర్యావరణ వినాశక అంశాలు జెండా పండుగ వేడుకల్లో లేకుండా చూడాలన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ, సర్పంచి వ్యవస్థలను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. పంచాయతీలు ఆర్థిక పరిపుష్టి కలిగించి, తిరిగి జీవం పోయాలనే తపనతో వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

12/08/2024

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న కొడుకు పిన్నెల్లి గౌతంరెడ్డి అరాచకాలపై తిరగబడ్డ మహిళలు..
సహాయం కోసం వైసీపీ ఆఫీసుకు వచ్చిన మహిళపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తిరగబడి చితక బాదిన గ్రామస్తులు.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఓబులవారిపల్లి మండలం చిన్న వరంపాడు వద్ద స్కూల్ వ్యాన్ బోల్తా. ఒక విద్యార్థిని అక్కడికక్కడే ...
12/08/2024

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఓబులవారిపల్లి మండలం చిన్న వరంపాడు వద్ద స్కూల్ వ్యాన్ బోల్తా. ఒక విద్యార్థిని అక్కడికక్కడే మృతి. పలువురికి గాయాలు.

Address

Vijayawada
<<NOT-APPLICABLE>>

Opening Hours

Monday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

9000022286

Alerts

Be the first to know and let us send you an email when Manadailynews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Manadailynews:

Share