26/09/2025
*ప్రెస్ నోట్ -26-09-2025*
*విజయవాడ* -
*హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ బాడవపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసిపి శ్రేణుల నిరసన*
*అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన వైసిపి శ్రేణులు*
*నిరసనలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసిపి అధ్యక్షులు దేవినేని అవినాష్ ,డిప్యూటీ మేయర్లు బెల్లందుర్గ,అవుతు శైలజారెడ్డి,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మరియు రాష్ట్ర,జిల్లా పదవుల్లో ఉన్న నాయకులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు.
*బాలకృష్ణ పై దేవినేని అవినాష్ ఫైర్*
*బాలకృష్ణ తక్షణమే జగన్ మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్*
*జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్*
అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజానికి సిగ్గుచేటు
కోట్లాది మంది పేదలకు మంచి చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి
ఎన్టీఆర్,వైఎస్సార్ అంటే మాకు దైవ సమానం
ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పై కూడా మీకు గౌరవం ఉండేది
బాలకృష్ణ వ్యాఖ్యలతో మాకు వారి పట్ల ఉన్న గౌరవం పోయింది
ఏనాడైనా .. ఒక్క పథకానికైనా చంద్రబాబు ఎన్టీఆర్ పేరు పెట్టారా
కనీసం ఏనాడైనా ఆ ఆలోచన చంద్రబాబుకు వచ్చిందా
మా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి
ఐదేళ్లలో మీ సినిమాలకు అడ్డు చెప్పలేదు
మీ బసవతారకం ఆసుపత్రికి సహకరించారు
మంచి చేసిన వారిని తూలనాడటం బాలకృష్ణకు అలవాటు
బెజవాడ సాక్షిగా మోదీ తల్లిని తిట్టి...మళ్లీ వాటేసుకున్న వ్యక్తి బాలకృష్ణ
బాలకృష్ణ వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం
సభలో లేని...అసలు సంబంధంలేని చిరంజీవిని కూడా తూలనాడారు
చిరంజీవిని తూలనాడినా.. కనీసం ఖండించలేని స్థితిలో జనసేన మంత్రులు,ఎమ్మెల్యేలు ఉన్నారు
మంత్రి కందుల దుర్గేష్ కనీసం బాలకృష్ణ వ్యాఖ్యలను వ్యతిరేకించలేక పోయారు
ఎందుకు ఇంకా మీకు ఇంతటి బానిసత్వం
నిండు సభలో చిరంజీవిని అవమానిస్తే ఏమైపోయారు మీరంతా
మేమూ బాలకృష్ణను అనగలం...కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పారు
కూటమి ఎమ్మెల్యేలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని అంబేద్కర్ ను కోరుకున్నాం
*బాలకృష్ణ తక్షణమే జగన్ మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి*
వైఎస్సార్ , జగన్ వల్ల మీకు, మీ కుటుంబానికి జరిగిన మేలును గుర్తు చేసుకోండి