Islamic Voice

Islamic Voice స్ఫూర్తిదాయక వార్తప్రపంచం

News via
06/08/2026

News via

స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాల ప్రదర్శనకు_స్వాగతం  కదిరి పట్టణంలో  ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు 20 వరకు జమాత్ ఏ ఇస్లామీ హింద్ ...
31/07/2026

స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాల ప్రదర్శనకు_స్వాగతం
కదిరి పట్టణంలో ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు 20 వరకు జమాత్ ఏ ఇస్లామీ హింద్ కదిరి శాఖ ఆధ్వర్యంలో "స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాల ప్రదర్శన" జరగనుంది. ఈ ఇరవై రోజులపాటు ప్రజలకు, ప్రధానంగా విద్యార్థులకు వివిధ ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నామని జమాత్ ప్రతినిధి Mr. Abdul Qadri Umri గారు శుక్రవారం నాడు తెలిపారు.

Kindly Your prompt attention to completing the work would be appreciated.
29/07/2026

Kindly Your prompt attention to completing the work would be appreciated.

శుక్రవారం (జుముఆ) నమాజును నిర్లక్ష్యం - హెచ్చరికఅబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ మరియు అబూ హురైరా (ర'దిఅల్లాహు అన్'హు) ఉల్లేఖించిన...
23/07/2026

శుక్రవారం (జుముఆ) నమాజును నిర్లక్ష్యం - హెచ్చరిక

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ మరియు అబూ హురైరా (ర'దిఅల్లాహు అన్'హు) ఉల్లేఖించిన దాని ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
"ప్రజలు శుక్రవార నమాజును నిర్లక్ష్యం చేయడం మానుకోవాలి, లేకపోతే అల్లాహ్ వారి హృదయాలను మూసివేస్తాడు, అప్పుడు వారు కూడా అశ్రద్ధ చేసేవారిలో చేరిపోతారు."
(సహీహ్ ముస్లిం 865)

అబూ హురైరా (ర'దిఅల్లాహు అన్'హు) ఉల్లేఖించిన దాని ప్రకారం, అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:
"సూర్యోదయం అయిన రోజులలో శుక్రవారం ఉత్తమమైన రోజు. ఆ రోజునే ఆదం సృష్టించబడ్డాడు, ఆ రోజునే అతను స్వర్గంలోకి ప్రవేశించాడు, మరియు ఆ రోజునే దాని నుండి బహిష్కరించబడ్డాడు. మరియు అంతిమ ఘడియ శుక్రవారం తప్ప మరే రోజునూ రాదు." (సహీహ్ ముస్లిం 854)

సల్మాన్ (ర'దిఅల్లాహు అన్'హు) కథనం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచనం, "జుముఆ రోజు స్నానంచేసి, పరిశుభ్రంగా తయారై,
సువాసన పులుముకొని జుముఆ నమాజు కోసం బయలు దేరి, మస్జిద్లోకి చేరి, ఇద్దరు వ్యక్తులను వేరు చేయకుండా,(ఇద్దరు వ్యక్తులను వేరుచేయడం అంటే, ఇద్దరు వ్యక్తులమధ్య వెళ్ళి కూర్చోకూడదు. లేదా మెడలపై నుండి గెంతుతూ వెళ్ళరాదు. స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కూర్చోవాలి. ఖుత్బా సమయంలో నిశ్శబ్దంగా ఉండాలి. మాట్లాడరాదు. నమాజు చదవరాదు. ఒకవేళ ఖుత్బా ప్రారంభమయిన తర్వాత ఎవరైనా వస్తే స్వల్పంగా రెండు రకాతులు చదివి కూర్చోవాలి.(బుఖారీ)
ప్రవక్త ﷺ ఇలా అన్నారు:
"ఎవరైతే శుక్రవారం నాడు స్నానం చేసి, నమాజుకు వచ్చి, తన కొరకు విధింపబడిన నమాజు చేసి, ఇమామ్ తన ప్రసంగాన్ని ముగించే వరకు శ్రద్ధగా విని, ఆ తర్వాత ఆయనతో పాటు నమాజు చేస్తారో, వారి పాపాలు ఆ శుక్రవారం నుండి తరువాతి శుక్రవారం వరకు, మరియు అదనంగా మరో మూడు రోజుల వరకు కూడా క్షమించబడతాయి." (సహీహ్ ముస్లిం 857)

అబూ హురైరా (ర'దిఅల్లాహు అన్'హు) ఉల్లేఖించిన దాని ప్రకారం, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: "శుక్రవారం నాడు ఇమామ్ ఖుత్బా ఇస్తున్నప్పుడు, మీరు మీ సహచరునితో 'నిశ్శబ్దంగా ఉండు' అని చెప్పినా,మీరునిష్ప్రయోజనమైన మాటలలో నిమగ్నమైనట్లే."
(సహీహ్ అల్-బుఖారీ 934, సహీహ్ ముస్లిం 851)

అవ్స్ ఇబ్న్ అవ్స్ (ర'దిఅల్లాహు అన్'హు) ఉల్లేఖించిన దాని ప్రకారం, అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:
"మీ రోజులలో శుక్రవారం ఉత్తమమైన వాటిలో ఒకటి, కాబట్టి ఆ రోజున నాపై అపారమైన ఆశీర్వాదాలు పంపండి, ఎందుకంటే మీ దరూద్ నాకు సమర్పించబడతాయి."
(సునన్ అబూ దావూద్ 1047, సునన్ అల్-నసాయీ 1374)

అబూ హురైరా (ర'దిఅల్లాహు అన్'హు) ఉల్లేఖించిన దాని ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు:
"శుక్రవారం నాడు ఒక గంట సమయం ఉంది, ఆ సమయంలో ఒక ముస్లిం నమాజులో నిలబడి అల్లాహ్‌ను ఏదైనా మంచిని కోరితే, అల్లాహ్ దానిని అతనికి ప్రసాదిస్తాడు."
(సహీహ్ అల్-బుఖారీ 935, సహీహ్ ముస్లిం 852)

అల్లాహ్ మనందరికీ జుముఆ దినాన్ని గౌరవించే, జుముఆ నమాజుకు క్రమం తప్పకుండా సకాలంలో హాజరయ్యే, దాని సున్నతులను ఆచరించి తద్వారా లభించే అపారమైన శుభఫలాలను పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్.

జుము'అహ్ నమాజ్ తప్పనిసరి అయిన ఏ ముస్లింమైన...అజాన్ తర్వాత కొనడం, అమ్మడం తదితర వ్యాపార లావాదేవీలన్నీనిషిద్ధం.  ఈ సమయంలో వ...
10/07/2026

జుము'అహ్ నమాజ్ తప్పనిసరి అయిన ఏ ముస్లింమైన...అజాన్ తర్వాత కొనడం, అమ్మడం తదితర వ్యాపార లావాదేవీలన్నీ
నిషిద్ధం.
ఈ సమయంలో వ్యాపారాన్ని చెల్లనిది లేదా పాపంతో కొనసాగించడం అంటే మీ సంపద నుంచి_బర్కత్, శుభాలను(ఆశీర్వాదాలు)ను తీసివేయడమే.

ﻳَٰٓﺄَﻳُّﻬَﺎ ٱﻟَّﺬِﻳﻦَ ءَاﻣَﻨُﻮٓا۟ ﺇِﺫَا ﻧُﻮﺩِﻯَ ﻟِﻠﺼَّﻠَﻮٰﺓِ ﻣِﻦ ﻳَﻮْﻡِ ٱﻟْﺠُﻤُﻌَﺔِ ﻓَﭑﺳْﻌَﻮْا۟ ﺇِﻟَﻰٰ ﺫِﻛْﺮِ ٱﻟﻠَّﻪِ ﻭَﺫَﺭُﻭا۟ ٱﻟْﺒَﻴْﻊَ ۚ ﺫَٰﻟِﻜُﻢْ ﺧَﻴْﺮٌ ﻟَّﻜُﻢْ ﺇِﻥ ﻛُﻨﺘُﻢْ ﺗَﻌْﻠَﻤُﻮﻥَ

ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుము 'అహ్) రోజు నమా'జ్‌ కొరకు పిలుపు ఇవ్వబడి నప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్‌ స్మరణ వైపునకు పరుగెత్తండి. మీరు తెలుసుకోగలిగితే, ఇది మీకు ఎంతో ఉత్తమమైనది! (62:9)

ﻓَﺈِﺫَا ﻗُﻀِﻴَﺖِ ٱﻟﺼَّﻠَﻮٰﺓُ ﻓَﭑﻧﺘَﺸِﺮُﻭا۟ ﻓِﻰ ٱﻷَْﺭْﺽِ ﻭَٱﺑْﺘَﻐُﻮا۟ ﻣِﻦ ﻓَﻀْﻞِ ٱﻟﻠَّﻪِ ﻭَٱﺫْﻛُﺮُﻭا۟ ٱﻟﻠَّﻪَ ﻛَﺜِﻴﺮًا ﻟَّﻌَﻠَّﻜُﻢْ ﺗُﻔْﻠِﺤُﻮﻥَ

ఇక నమా'జ్‌ పూర్తి అయిన తరువాత భూమిలో వ్యాపించండి మరియు అల్లాహ్‌ అనుగ్రహాన్ని అన్వేషించండి మరియు మీరు సాఫల్యం పొందాలంటే అల్లాహ్‌ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి! (62:10)

అబూ హురైరహ్ ర'దిఅల్లాహు అన్'హు కథనం: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రవచనం, "జుమ'అహ్ రోజు దైవదూతలు మస్జిద్ ద్వారం వద్ద నిలబడతారు. నమా'జు చదవడానికి వచ్చే వారి పేర్లు వ్రాస్తారు. అందరికంటే ముందు వచ్చినవారి పేరు మొదటి స్థానంలో వ్రాస్తారు. ఆ తరువాత వచ్చిన వారి పేరు తరువాత వ్రాస్తారు. మొదట వచ్చినవ్యక్తి ఖుర్ బానీ కోసం ఒంటె పంపి నట్లు, తరువాత వచ్చినవాడు ఖుర్బానీ కోసం ఆవు పంపినట్లు, ఆ తరువాత వచ్చిన వ్యక్తి మేక ఖుర్బానీ ఇచ్చినట్టు, ఆ తరువాత వచ్చిన వ్యక్తి కోడి పంపినట్టు, ఆ తరువాత వచ్చిన వ్యక్తి గ్రుడ్డు పంపినట్టు. ఇమామ్ ఖుత్బా ఇవ్వడానికి రాగానే దైవదూతలు తమ ఖాతాలను మూసి వేసి ఖుత్బా వినడానికి సిద్ధమౌతారు.
(బు'ఖారీ, ముస్లిమ్)

ఆషూరా ఉపవాసం ముహర్రం 1448 | జూన్ 2026 జూన్-25        జూన్-26     జూన్-27(గురువారం)  (శుక్రవారం)  (శనివారం)       9      ...
24/06/2026

ఆషూరా ఉపవాసం
ముహర్రం 1448 | జూన్ 2026
జూన్-25 జూన్-26 జూన్-27
(గురువారం) (శుక్రవారం) (శనివారం)
9 10 11

ముహర్రం 9 మరియు 10 తేదీలలో ఉపవాసం ఉండాలని సిఫారస్సు చేయబడింది.
హజ్రత్ ఇబ్నె అబ్బాస్‌ (ర'దిఅల్లాహు అన్'హు) కథనం ప్రకారం: “ దైవప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆషూరా రోజు (ముహర్రం నెల పదో తేదీన స్వయంగా ఉపవాసం ఉన్నారు. మరియు ఆ రోజు ఉపవాసం పాటించమని తన సహచరులను ఆదేశించారు.” (బుఖారీ : 1865, ముస్లిం : 1911)

ప్రవక్త ﷺ 'ఆషూరా' రోజుకు ఉన్న గొప్ప యోగ్యత స్థానం కారణంగా, ఆ రోజున తప్పకుండా ఉపవాసం ఉండేలా చూసుకోవడానికి చాలా ఆసక్తి చూపేవారు.
ఇబ్న్ అబ్బాస్ (అల్లాహ్ అతనిపై ప్రసన్నుడగుగాక) ఇలా అన్నారని ఉల్లేఖించబడింది: "'ఆషూరా' రోజు మరియు ఈ మాసం (అంటే రమదాన్) తప్ప, ప్రవక్త ﷺ మరే ఇతర రోజు ఉపవాసం ఉండేలా చూసుకోవడానికి ఇంత ఆసక్తి చూపడం, ప్రాధాన్యత ఇవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు." [ అల్-బుఖారీ, 1867 ద్వారా ఉల్లేఖించబడింది]

హజ్రత్ అబూహురైరా (ర'దిఅల్లాహు అన్'హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా ప్రవచించారు: రమదాన్ తర్వాత అల్లాహ్ మాసమైన ముహార్రం నెలలో పాటించే ఉపవాసాలు అత్యంత శ్రేష్టమైనవి.
(సాహీహ్ ముస్లింలోని ఉపవాసాల ప్రకరణం)
హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్‌ అబ్బాస్‌ (ర'దిఅల్లాహు అన్'హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “ఒక వేళ నేను వచ్చే సంవత్సరం వరకు బతికుంటే ముహర్రం మాసపు 9 తేదిన కూడా ఉపవాసం పాటిస్తాను.”(ముస్లిం : 1917)

హజ్రత్ అబూ ఖతాదా (ర'దిఅల్లాహు అన్'హు) కథనం: ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారిని ఆషూరా నాటి ఉపవాసం (ఘనతను) గురించి అడగటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, “అది గత సంవత్సరపు పాపాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది" అని చెప్పారు. (ముస్లిం : 1977)

Address

Hyderabad &
Vijayawada

Opening Hours

Friday 9am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Islamic Voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share