
29/06/2024
‘కల్కి’తో న్యూ లెవెల్ అన్‌లాక్: విజయ్ దేవరకొండ
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కల్కి’ మూవీతో ఇండియన్ సినిమా న్యూ లెవెల్ అన్‌లాక్ అయిందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఇంతకుముందే సినిమా చూశానని, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదని ట్వీట్ చేశారు. ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ఆకాంక్షించారు. కాగా ఈ చిత్రంలో విజయ్ అర్జునుడి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.