Maa Mangalagiri

Maa Mangalagiri 📍 Maa Mangalagiri
📰 Local News | 📢 Promotions | 🎉 Events
🛍️ Small Business Support | 📸 Real-time Updates
📲 Stay connected with everything Mangalagiri!

02/11/2025

🩺 Welcome to SambaSiva Medicals – Mangalagiri! 💊
Your trusted Wholesale & Retail Medical Store in the heart of Mangalagiri.

✨ We provide:
✅ Surgical items
✅ Generic & branded medicines
✅ All types of medical & healthcare products — under one roof!

💚 Quality • Trust • Affordable Prices

📍 Visit us today in Mangalagiri or contact us for orders & inquiries:
📞 92958 01599 | 74012 33456

*మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు.**అమరావతి:*అహింసనే ఆయుధంగా చేసుకుని ద...
02/10/2025

*మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు.*

*అమరావతి:*
అహింసనే ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ముందు నడిచి కోట్లాది భారతీయుల్లో చైతన్యాన్ని రగిలించిన గాంధీజీ ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అదే విధంగా స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. తుదిశ్వాస వరకు దేశం కోసం సేవలందించిన నిస్వార్థ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు అని, నీతికి, నిరాడంబరతకు మారుపేరుగా నిలిచారని కొనియాడారు. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశ అభ్యున్నతికి అందించిన సేవలను స్మరించుకుందాం అని పిలుపునిచ్చారు.

*చట్ట వ్యతిరేక “అసాంఘిక కార్యకలాపాలను  ఉపేక్షించేది లేదు – జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్*”గుంటూరు జిల్లా  ఎస్పీగా బాధ్యతలు ...
01/10/2025

*చట్ట వ్యతిరేక “అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదు – జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్*”

గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వకుల్ జిందాల్ ఆకస్మిక తనిఖీలతో తన పర్యటనను ప్రారంభించారు. బుధవారం ఆయన మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లను పరిశీలించి, స్థానిక పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.మంగళగిరి పరిధిలో గంజాయి సమస్య, ట్రాఫిక్ సమస్యలను ప్రధానంగా గుర్తించామని, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు... బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో అలాంటి చర్యలు ఇతరులకు అసౌకర్యం కలిగిస్తే కఠినంగా వ్యవహరించడం తప్పదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని, శాంతి భద్రతల భంగానికి కారణమయ్యే వ్యక్తుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని ఎస్పీ కోరారు...రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలపై సమీక్షించి, సంబంధిత అధికారులతో చర్చించినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకోవాలని సూచనలు చేసినట్లు తెలిపారు.... సిబ్బంది కొరతను రాబోయే నియామకాలలో సిబ్బంది కొరత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు. “పోలీసులు ప్రజలకు దగ్గరగా ఉండాలి, స్నేహభావంతో మెలగాలి. ప్రజలకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవడమే మా ప్రధాన కర్తవ్యం” అని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు.

*గాంధీ జయంతి సందర్భంగా మాంసాహార విక్రయాలపై నిషేధం*మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి ...
01/10/2025

*గాంధీ జయంతి సందర్భంగా మాంసాహార విక్రయాలపై నిషేధం*

మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా మాంసం, చేపల విక్రయాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ అలీమ్ భాష ప్రకటించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిషేధం మాంసం, చేపల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు సహా అన్ని వాణిజ్య సంస్థలకు వర్తిస్తుందని తెలిపారు. నిర్ణీత తేదీన నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో సంబంధితులపై చట్టపరమైన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.

🌿✨ ఎకో పార్క్ వాకర్స్‌కు శుభవార్త! ✨🌿🚶‍♂️🚶‍♀️ మంగళగిరి ఎకో పార్క్‌లో వాకింగ్ ట్రాక్ సమస్యపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాని...
18/09/2025

🌿✨ ఎకో పార్క్ వాకర్స్‌కు శుభవార్త! ✨🌿

🚶‍♂️🚶‍♀️ మంగళగిరి ఎకో పార్క్‌లో వాకింగ్ ట్రాక్ సమస్యపై సోషల్ మీడియాలో వచ్చిన కథనానికి 💻📲
మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందించారు! 🙌

🪴 ఆయన ఆదేశాల మేరకు అటవీ శాఖ సిబ్బంది 👉
✅ పిచ్చి మొక్కల తొలగింపు
✅ ముళ్ళ చెట్ల తొలగింపు పనులు ప్రారంభించారు.

🌧️ వర్షాలు తగ్గిన వెంటనే ట్రాక్‌పై గ్రావెల్ వేసి మరమ్మత్తులు చేస్తాం అని అధికారులు తెలిపారు.

👏 వాకర్స్ అందరూ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

✨ స్వస్థ్ నారి – ససక్త్ పరివార్ అభియాన్ శిబిరాలకు విశేష స్పందన ✨👩‍⚕️ మంగళగిరి మండలం రామచంద్రపురం లోని అర్బన్ ప్రైమరీ హెల...
17/09/2025

✨ స్వస్థ్ నారి – ససక్త్ పరివార్ అభియాన్ శిబిరాలకు విశేష స్పందన ✨

👩‍⚕️ మంగళగిరి మండలం రామచంద్రపురం లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద ఎయిమ్స్ వైద్యులు ప్రత్యేక వైద్య సేవలు అందించారు.

📌 ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు, ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ ప్రత్యేక శిబిరాలు నిర్వహించబడుతున్నాయి.

👩‍👩‍👧‍👧 ముఖ్యంగా మహిళలకు బిపి, షుగర్ తో పాటు పలు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు.
💊 పరీక్షల అనంతరం అవసరమైన మందులు అందజేశారు.
📚 విద్యార్థినిలు, మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.

🩺 ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ చండీ ప్రియాంక, లక్ష్మీనారాయణ, డాక్టర్ చైతన్య, చిరంజీవి, కృష్ణ, లావణ్య, రామచంద్రపురం యూపీహెచ్సి సూపర్వైజర్ ఎన్. సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

💡 అక్టోబర్ 2 వరకు ఈ శిబిరాలు కొనసాగనున్నందున, అందరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు పిలుపునిచ్చారు.



✨🚶‍♂️ వాకింగ్ ట్రాక్ నిర్వహణపై దృష్టి సారించండి! 🚶‍♀️✨🏞️ మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్ లో ప్రతిరోజూ వందలాది మంది...
17/09/2025

✨🚶‍♂️ వాకింగ్ ట్రాక్ నిర్వహణపై దృష్టి సారించండి! 🚶‍♀️✨

🏞️ మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్ లో ప్రతిరోజూ వందలాది మంది ఉదయం నడక కోసం వస్తున్నారు. ఆరోగ్య సంరక్షణలో భాగంగా వాకర్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

⚠️ అయితే వాకింగ్ ట్రాక్ సక్రమంగా నిర్వహించకపోవడంతో రాళ్లు బయటకు రావడం, నడకలో ఇబ్బందులు కలుగుతున్నాయి అని వాకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

🙏 సంబంధిత శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని, వాకింగ్ ట్రాక్ ను సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

💚 ఆరోగ్యం కోసం వాకింగ్… సౌకర్యం కోసం నిర్వహణ అవసరం!



🏥 తుళ్లూరులో వైద్య సదుపాయాల అభివృద్ధి కోసం వినతి 🏥📌 తుళ్లూరు గ్రామస్తుల ప్రతినిధుల బృందం ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో APMSI...
16/09/2025

🏥 తుళ్లూరులో వైద్య సదుపాయాల అభివృద్ధి కోసం వినతి 🏥

📌 తుళ్లూరు గ్రామస్తుల ప్రతినిధుల బృందం ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) అభివృద్ధి కోసం వినతిపత్రం అందజేశారు.

📝 వినతిలో:
✅ వైద్య సిబ్బంది పెంపు
✅ ఆధునిక పరికరాల ఏర్పాటు
✅ పిల్లల & మాతృ ఆరోగ్య సేవలు
✅ అత్యవసర చికిత్సా సదుపాయాలు

💬 ఈ సందర్భంగా స్పందించిన శ్రీనివాసరావు గారు:
👉 “తుళ్లూరు వంటి ప్రాధాన్య ప్రాంతంలో ఆరోగ్య సదుపాయాల విస్తరణ అత్యవసరం. తక్షణమే తగిన చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.

🙏 గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

⚖️ ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర కీలకం ⚖️మంగళగిరిలో న్యాయవాదుల దినోత్సవం పురస్కరించుకొని, ప్రముఖ న్యా...
16/09/2025

⚖️ ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర కీలకం ⚖️

మంగళగిరిలో న్యాయవాదుల దినోత్సవం పురస్కరించుకొని, ప్రముఖ న్యాయవాదులు –
👨‍⚖️ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లంక శివరాం ప్రసాద్
👨‍⚖️ సీనియర్ న్యాయవాది వాకా రామ్ గోపాల్ గౌడ్ –
సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య గారిచే శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో సన్మానించబడ్డారు. 🌹

🎙️ ఈ సందర్భంగా కంచర్ల కాశయ్య మాట్లాడుతూ:
👉 “ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించడంలో, పేదలు–వెనుకబడిన వర్గాలకు చట్ట పరిరక్షణ కల్పించడంలో అపూర్వమైన సేవలు అందిస్తున్నారు” అని అన్నారు.

🙏 సమాజంలో న్యాయం నిలబడేందుకు న్యాయవాదుల కృషి అమూల్యం.

👷‍♂️✨ ఆధునిక భారత రూపకర్తలు – ఇంజనీర్లు ✨👷‍♀️🇮🇳 దేశ గర్వకారణమైన మహానీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా ఇం...
16/09/2025

👷‍♂️✨ ఆధునిక భారత రూపకర్తలు – ఇంజనీర్లు ✨👷‍♀️

🇮🇳 దేశ గర్వకారణమైన మహానీయుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా ఇంజనీర్స్ డే వేడుకలు మంగళగిరిలో ఘనంగా జరిగాయి.

📍 హాట్స్ & ట్రీస్ రెస్టారెంట్, లిటిల్ విలేజ్ సమీపం
🎙️ కార్యక్రమంలో మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ హలీం భాష ముఖ్య అతిథిగా పాల్గొని, దేశ నిర్మాణంలో ఇంజనీర్ల కీలక పాత్రను గుర్తుచేశారు.

⚙️ అమరావతి ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేమూరి మైనర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో పలువురు ఇంజనీర్లు, పట్టణ ప్రణాళికాధికారులు పాల్గొన్నారు.

🌟 విశ్వేశ్వరయ్య ఆలోచనలు ఈ తరం ఇంజనీర్లకు స్ఫూర్తి… సమాజ ప్రగతికి కొత్త ఆవిష్కరణలే మార్గం!

✨ మంగళగిరిలో మోడల్ లైబ్రరీ రూపుదిద్దుకుంటోంది ✨📚 మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో💰 రూ.1.30 కోట్లు వ్యయంతో ఆధునిక సదుపా...
16/09/2025

✨ మంగళగిరిలో మోడల్ లైబ్రరీ రూపుదిద్దుకుంటోంది ✨

📚 మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో
💰 రూ.1.30 కోట్లు వ్యయంతో ఆధునిక సదుపాయాలు
🎯 పోటీ పరీక్షల అభ్యర్థులకు పెద్ద వరం

🚀 ఈ నెలాఖరుకల్లా పనులు పూర్తవనున్నాయి!
🏛️ 2 అంతస్తుల ఆధునిక లైబ్రరీ
🖥️ డిజిటల్ లైబ్రరీ – 20 కంప్యూటర్లు
📖 అన్ని పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు
👩‍🎓👨‍🎓 క్లాస్‌రూమ్స్ – కాంపిటీటివ్ & స్పోకెన్ ఇంగ్లీష్

👉 విద్యార్థులు, నిరుద్యోగ యువతకు మంగళగిరి మరింత శక్తివంతమైన జ్ఞానకేంద్రంగా మారబోతోంది!

Address

Dwaraka Nagar
Vijayawada

Telephone

+917050090909

Website

Alerts

Be the first to know and let us send you an email when Maa Mangalagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Maa Mangalagiri:

Share