07/01/2014
@35.
Friends mi andariki okati chepali ani anukuntunanu edhi PHILOSAPHY ani anukokandi okasari chadavandi plzzz
FRIENDS edhi mana andaram alochinchavalasina vishayam.
Manam mana jevitham lo manchiga vunte evariki ye hani cheyakunda adhe manchithanam manaki chavulo kuda thodu vasthundhi.........daniki example mana hero UDAY KIRAN jeevitham.
అందరూ కాలేజి ఎగ్గొట్టి సినిమాలు చూసే వయసులోనే ఉదయ్ కిరణ్ సినీ హీరోగా అంతులేని స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. హిట్ మీద హిట్ కొడుతూ దూసుకుపోయాడు. కానీ, తలరాతో లేక దాసరి నారాయణ రావు చెప్పినట్టు కొన్న శక్తుల ప్రోద్బలమో కానీ, ఉదయ్ కిరణ్ చిన్న వయసులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయ్ మరణ వార్త విన్న యావత్ ఆంధ్రదేశం ఒక్క సారిగా షాక్ కు గురయింది. అయ్యో పాపం అన్న వారే తప్పితే, మరో కామెంట్ ఎవరూ చేయలేకపోయారు.
మరో విషాదమేంటంటే, ఉదయ్ మరణించినప్పుడు అతని పక్కన నా అన్న వారు కూడా లేకపోవడం. ఉదయ్ మరణ వార్త వినగానే శ్రీకాంత్, శివాజీ రాజా లాంటి నటులు కొంత మంది ఆయన నివాసం వద్దకు వచ్చారు. కానీ, మేమంతా ఒకే కుటుంబం అని చెప్పుకునే సినీ పరిశ్రమ పెద్దలు ఒక్కరంటే ఒక్కరూ రాలేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
ఉదయ్ కు తల్లి లేదు, అన్న లేడు, సొంత తండ్రి చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఉదయ్ అనాథ శవంలా మిగిలిపోయాడు. ఆయన అంత్యక్రియలు ఎలా జరుగుతాయో అన్న సందేహాలు అందర్లోనూ వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో సొంత మనుషులు లేకపోతే ఏంటి, మేమున్నామంటూ ఆయన అభిమానులు తరలి వచ్చారు. ఆయన నివాసం వద్ద, ఫిల్మ్ ఛాంబర్ వద్ద, చివరకు అంత్యక్రియల సమయంలోనూ... మేమే నీ ఆత్మీయులం అంటూ వీడ్కోలు పలికారు.
అభిమానుల రాకతో ఎర్రగడ్డ శ్మశానవాటిక ఇసుక వేస్తే రాలనంతగా నిండిపోయింది. చూశారా... ఆ నలుగురు సినిమాలో చూసిన సన్నివేశం ఉదయ్ జీవితంలో ఎలా నిజమయిందో. కల్మషం లేని చిరునవ్వే కాదు... అంతకన్నా గొప్ప వాడు ఉదయ్ కిరణ్. అందుకే బతికున్న రోజుల్లో ఒంటరి తనాన్ని ఫీలైనా... చనిపోయిన తర్వాత అంతమంది ఆప్యాయతల్ని, అనురాగాలనూ తనతో తీసుకెళ్లారు.