కబుర్లు కాకరకాయలు

కబుర్లు కాకరకాయలు నచ్చిన కబుర్లు తీయగా నచ్చని కబుర్లు ?

10/04/2024

పాశం
బలమైనదే
మనిషి
అవసరాన్ని బట్టి

కాలానికి
ఆమోదయోగ్యమే..!!

07/04/2024

అక్షరానికెంత మమకారమో_అమ్మ ప్రేమనంతా ఒలికించేస్తూ..!!

05/04/2024

సాక్ష్యాలు
మనసుకి
సంతకాలు
మనిషికి

కాలం
నిర్వికారం..!!

03/04/2024

అవసరమని
తీసుకోవడం
స్వా’ర్జితమని
స్వాహా చేయడం

మని’షికి
తెలివెక్కువ..!!

02/04/2024

మాటలు
ముత్యాలు
మూటలు
విలువైనవి

మరణం
అనివార్యం..!!

29/03/2024

నటించడం
అలవాటై పోయింది
జీవన నాటకంలో
పాత్రదారులకు

ప్రపంచం
ఓ పెద్ద రంస్థలం..!!

21/03/2024

అవసరార్థపు
అనుబంధాలే అన్నీ
మక్కువ మత్తు
మిక్కిలిగా చల్లేస్తూ

కలియుగ
ధర్మం..!!

“నానీల తీరాన”మనసునుఇచ్చేసింది అక్షరాలకుఅనుభవాలనునానీలుగా మార్చేస్తూ..!!పుస్తకం నా చేతికి వచ్చి కొన్ని రోజులయినా తీరికగా ...
18/03/2024

“నానీల తీరాన”

మనసును
ఇచ్చేసింది అక్షరాలకు
అనుభవాలను
నానీలుగా మార్చేస్తూ..!!

పుస్తకం నా చేతికి వచ్చి కొన్ని రోజులయినా తీరికగా తరువాత చదువుదాములే అని పెట్టుకున్నా. ఈరోజు ఎందుకో అసలు ఏముందో చూద్దామని తీసానా..!! ఇక మెుదటి నానీ నుండి చివరి నానీ వరకు ఆపలేదు. ఇది బావుంది, ఇది బాలేదు అని లేదు అన్నీ చాలా పరిణితితో రాసినట్లుగా అనిపించాయి. జీవితంలో అన్ని పార్శ్వాలు చవి చూసినట్లుగా అర్థమయ్యింది. అమ్మమ్మ నుండి మెుదలెట్టి అమ్మ, నాన్న, గురువు, పల్లె, పట్టణం, అనుబంధాలు, ప్రేమలు, కన్నీళ్లు, గాయాలు, డబ్బు, రాజకీయం, చీకటి, వెలుతురు, చిన్నతనం, స్నేహాలు, సముద్రం..ఇలా ఒకటేమిటి ప్రతిదీ నాకయితే అద్భుతమే అనిపించింది. పుస్తకానికి పేరు సరిగ్గా సరిపోయింది. గాయాలను గురువుతో పోల్చడం చాలా బాగా నచ్చింది.
ఓ మంచి పుస్తకం చదివిన అనుభూతిని అందించిన “ నానీల తీరాన” ఎన్ లహరికి హృదయపూర్వక అభినందనలు.

17/03/2024

చుట్టరికం
అవసరమే
తంత్రం
అనివార్యం

నమ్మకం
బలమైనది..!!

13/03/2024

వెలితి
పడటం
కలత
చెందడం

మనసుకు
తప్పనిసరి..!!

ఈ నెల నవమల్లెతీగలో నా వ్యాసాన్ని ప్రచురించిన సాహితీ యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు..నేస్తం,          కొందరిని చూస్తు...
12/03/2024

ఈ నెల నవమల్లెతీగలో నా వ్యాసాన్ని ప్రచురించిన సాహితీ యాజమాన్యానికి మనఃపూర్వక ధన్యవాదాలు..

నేస్తం,
కొందరిని చూస్తుంటే వీరు ఇంతగా దిగజారి ప్రవర్తించడానికి కారణాలు ఏమిటన్నది అస్సలు అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు వీరిని అంత సంస్కారహీనంగా పెంచారా అని బాధ వేస్తున్నది. అబ్బాయిలు ఏమైనా చేయవచ్చు ఆనాటి నుండి ఈనాటి వరకు. కాని అమ్మాయిలు ఏ పని చేసినా ఆక్షేపణలే అని బుుజువైంది. మనం వాడే బాష మన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది అని మనం మర్చిపోవడం చాలా బాధాకరమయిన విషయం. మన చట్టసభలే ఇందుకు ఉదాహరణ.
ఒకప్పుడు ఆడపిల్లల్ని కాలేజ్ లలో ఏడిపించేవారు. ఎక్కడో ఒకటి అరా సంఘటనలు మినహాయించి శృతిమించని విధంగానే ఉండేది. రానురానూ కాలేజ్ లే కాకుండా స్కూల్స్ లో కూడా మెుదలై “ ఇంతింతై వటుడింతై” అన్నట్టుగా ఈ టీజింగ్ వేళ్ళూరుకు పోయింది. ఇక ఈ మోబైల్ యుగంలో అది ఎంతలా పాకిపోయిందంటే మనం మనిషి అన్న విచక్షణని మరిచిపోయేతంగా!
రీల్స్, వీడియోస్ పలానావాళ్ళే చేయాలి, ఇలాగే చేయాలి అన్న రూల్ ఏమైనా ఉందా! నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసినప్పుడు, ఎదుటివారికి కూడా ఆ హక్కు ఉందని మరిచిపోయి, మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని, మనమూ ఓ అమ్మకే పుట్టామని మర్చిపోవడం చాలా విచారకరం. గత ఐదేళ్ళుగా ఈ ట్రోలింగ్ సంస్కారాన్ని పెంచి పోషిస్తున్న ప్రతి ఒక్కరికి మనం పాదాభివందనం చేయాల్సిందే. ఎందుకంటే ఇంత సంస్కారవంతంగా వారిని పెంచిన తల్లిదండ్రులకు మనం బుుణపడివున్నాం కనుక.
బాధ్యతాయుతమైన పదవుల్లో వుండి, చట్టసభల్లో కూడా ఈ హేయమైన సంస్కృతికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరూ ఇందుకు బాధ్యులే. ఇలాంటి సంస్కారవంతుల్ని ఎన్నుకుంటున్న మన ప్రజాస్వామ్యానికి నా ప్రగాఢ సానుభూతి. ఏ మార్పైనా ఒక్కరితోనే మెుదలవుతుంది అన్న మాటకు ఇవన్నీ సాక్ష్యాలే. ఏ వ్యవస్థ అయినా బావుండాలంటే ముందు మన ఇంట్లో మనతో వున్న వారి వ్యక్తిత్వాన్ని చూడాలి. నిజానిజాలు తెలుసుకోవాలి. పదవులదేముంది, కొన్ని కోట్లు మనవి కావనుకుంటే చాలు. కాని ఆ పదవికి వన్నె తేవడంతోనే మన వ్యక్తిత్వం, సంస్కారం తేటతెల్లమౌతుంది. విచక్షణా జ్ఞానం మనిషికి భగవంతుడు ఇచ్చిన వరం. దానిని ఉపయోగించడం, ఉపయోగించక పోవడం అన్నది ఆ మనిషి పెరిగిన పరిసరాలు, పెంపకాలపై ఆధారపడి వుంటుంది. సంస్కారం లేనప్పుడు ఎన్ని వున్నా ఏమి లేనట్లే. మంచి మార్పు కోసం ఎదురుచూడటమే మన పని. ఈ ఆధునిక పోకడల యుగంలో కాస్తయినా మన అమ్మానాన్నల పెంపకాలను నలుగురూ ప్రశ్నించకుండా ఉండేలా నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం..!!

10/03/2024

విద్య
ఉండాలి
వైవిధ్యం
తెలియాలంటే

గుర్తింపు
గొప్పదనం..!!

ఓ గంగ కథే ఈ “గంగజాతర”       మన చుట్టూ జరుగుతున్న సంఘటనలకు అక్షర రూపమివ్వడమట, అదీ కుల వృత్తుల గురించి, ఆచార, వ్యవహారాల గు...
09/03/2024

ఓ గంగ కథే ఈ “గంగజాతర”
మన చుట్టూ జరుగుతున్న సంఘటనలకు అక్షర రూపమివ్వడమట, అదీ కుల వృత్తుల గురించి, ఆచార, వ్యవహారాల గురించి రాయడమంటే కాస్త కష్టతరమైన విషయమే. ఎజ్రాశాస్త్రిగారి రచనలు ముఖపుస్తకంలో చూస్తున్నప్పుడు ఈ మాటే అనిపించేది. వ్యవస్థలో దాగిన లోపాలను ఎత్తి చూపడానికి గుండెధైర్యం చాలా ఎక్కువగానే కావాలన, కష్టాన్ని చెప్పడానికి ఆ పలుచని తెరలు తీయడం సుళువు కాదనీ.
ఎజ్రాశాస్త్రిగారు తన “గంగజాతర” నవలలో మన సమాజంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలను మన ముందు ప్రత్యక్షంగా చూపారు. కనీస అవసరాలైన తిండి, నీటి కోసం తపన పడే ఓ అణగారిన వర్గాన్ని, నేరం ఒకరు చేస్తే, ఆ నేరాన్ని మరో వర్గానికి ఆపాదించి, వారిని భయబ్రాంతులను చేసి, ఊరు వదిలి పోయేటట్లు చేయడము, ఆ తరువాత వారు పడే ఇబ్బందులు, వీటికి సమాంతరంగా కులంలో జరిగే కులవృత్తులు, కలుపుగోలు తనాలు, మంచి, చెడు వగైరా కార్యక్రమాలు, అనుబంధాలు, ఆప్యాయతలు వంటి అన్నింటిని ఈ “గంగజాతర”లో చూపించారు.
ఆశయ సాధన కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేసారన్న విషయాన్ని, ఫ్లోరైడ్ బారిన పడిన తమ జాతిని ఎలా పరిరక్షించుకున్నారన్న విషయాన్ని సంజీవి, గంగ పాత్రలతో హృద్యంగా చిత్రీకరించి నవలకు చక్కని ముగింపు పలికారు. గొప్పగా రాసిన ఎజ్రాశాస్తిగారికి హృదయపూర్వక అభినందనలు. పుస్తకం కావాల్సినవారు సంప్రదించాల్సిన నెంబరు 7013975274.

06/03/2024

ఏ ఆటైనా
ఆడించేది వాడే
ఫలితాన్ని
నిర్దేశించేది వాడే

చతురుడు
పైవాడు..!!

02/03/2024

పలకరింపులు - పరిచయాలు..!!

నేస్తం,
కొన్ని పలకరింపులు ముఖతః కాకపోయినా మనసుకు ఎంతో సంతోషాన్నిస్తాయి. దాదాపు ముప్పైఐదేళ్ళ క్రిందట ఇంజనీరింగ్ మెుదటి సంవత్సర కాలం పరిచయంలో మా మధ్యన మాటలు చాలా తక్కువే. ప్రతి ప్రాక్టికల్ లో బాచ్ మేట్స్ మి. అయినా మా మధ్యన మాటలు తక్కువే. అయినా మొదట్లోనే నే పెట్టిన నిక్ నేమ్ మాత్రం మా నేస్తాలందరికి తెలుసు. మెుదటి సంవత్సరం తరువాతెప్పుడూమాట్లాడుకొన్నది లేదు. మెున్నటి డిసెంబర్ రీ యూనియన్ లో కూడా కలవలేదు. కాని మా రీయూనియన్ వాట్సప్ గ్రూప్ లో పుట్టినరోజుకి విష్ చేసిన తరువాత క్షేమ సమాచారాల మాటలతో కబుర్లతో నిక్ నేమ్ గుర్తు చేసాను. మా జీనియస్ కి కూడా తన నిక్ నేమ్ తెలుసు. చక్కగా పలకరించిన పలకరింపుకి చాలా సంతోషమనిపించింది. అప్పట్లో తెలుగు రాకపోయినా, ఇప్పుడు నేను రాసిన “ కాలం వెంబడి కలం” పుస్తకంలో తన గురించి రాసినది చదవడం భలే అనిపించింది.
పరిచయం ఎంత కాలమని మనం లెక్కలు వేసుకోనక్కర్లేదు. బేషజాలు, హంగులు, ఆర్భాటాలు స్నేహాన్ని ఎక్కువ కాలం నిలపలేవు. జ్ఞాపకానికి కాలంతో పని లేదు. ఎన్ని దశాబ్దాలయినా చెక్కుచెదరకుండానే ఉంటుంది. మనకి ఇప్పుడు డబ్బు, హోదా ఉందని జ్ఞాపకాలను వదిలించుకునే వారికి కొత్తగా చెప్పేదేం లేదు. దూరం బావుందనుకునే కొందరికి ఆ దూరమే మంచి నేస్తం. ఈ టెక్నాలజీ యుగంలో మనమూ టెక్నికల్ గా కాకుండా కాస్తయినా మనసుద(ధ)నముందని నిరూపించుకుందాం..!!

రవళి - మార్చి 2024 సంచిక Part 1 - Ravali Monthly- March Part 1 35,000 views  దాటి విజయవంతంగా మీ ముందుకు వస్తున్న రవళి. అ...
29/02/2024

రవళి - మార్చి 2024 సంచిక Part 1 - Ravali Monthly- March Part 1
35,000 views దాటి విజయవంతంగా మీ ముందుకు వస్తున్న రవళి.
అయిదవ సంచిక - ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ప్రత్యేక సంచిక part 1
చదవమని, link ను అందరికీ పంపమని మనవి.

https://online.fliphtml5.com/cqrre/mrrb/index.html

By crossing 35000 views , Ravali magazine is now in front of you.
Please read it and share the below magazine link to all your friends and relatives! 100% guarantee that you will like it! 😊

https://online.fliphtml5.com/cqrre/mrrb/index.html

చక్కని పత్రిక..ఓసారి చదివేయండి మరి

రవళి మాసపత్రికలో నా వ్యాసాన్ని ప్రచురించిన రామశర్మ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.కుటుంబం..!!          వినడానికి ఈ పదం చాలా...
29/02/2024

రవళి మాసపత్రికలో నా వ్యాసాన్ని ప్రచురించిన రామశర్మ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.

కుటుంబం..!!
వినడానికి ఈ పదం చాలా బావుంటుంది. కాని ఈ రోజుల్లో కుటుంబం అంటే మేము, మా పిల్లలు అన్నట్టుగా వున్నా, ఎవరి గదుల్లో వారు, ఎవరి పనుల్లో వారు మునిగి తేలుతున్నారు. భార్యాభర్తలు కూడా ఒకే గదిలో వున్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగానే ఈ ఆధునిక యుగంలో యంత్రాలకు అలవాటు పడి యాంత్రికంగానే మారిపోతున్నారు. మన ఇంటి గురించే మనం ఆలోచించ లేనప్పుడు ఇక సమాజం గురించి ఏం ఆలోచించగలం?
మన అమ్మానాన్న మనల్ని పెంచకుండానే మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామా! మనమీ స్థాయిలో ఉండటానికి మన తల్లిదండ్రులు ఎన్ని అవసరాలు మానుకున్నారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో అని మనమో క్షణమయినా వారి గురించి ఆలోచించ గలుగుతున్నామా! మన ఉన్నతస్థాయికి వారు అడ్డంకి అని వారిని వీధులపాలు కొందరు, వృద్దాశ్రమాలకు కొందరు పంపేస్తుంటే, మరికొందరేమో బిడ్డల నిరాదరణ తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
మన తరం అటు అమ్మానాన్నలను చూడలేక, ఇటు పిల్లలకు దగ్గర కాలేక రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యారు. మా అమ్మాయి/అబ్బాయి అమెరికాలో ఉన్నారని గర్వంగా చెప్పుకోవడం తప్ప, బంధాలను, అనుబంధాలను మన చేతులారా మనమే దూరం చేసుకుంటున్నామని గ్రహించలేక పోతున్నాం. ఉమ్మడితనంలోని సంతోషాలను అనుభవించ లేక ఏకాకితనాలకు అలవాటు పడిపోయి ఇదే అద్భుత ప్రపంచమని భ్రమ పడుతున్నాం.
మనం నేర్చుకున్న విలువలు మన తరువాతి తరాలకు పంచాలన్న ఆలోచన మనకు లేక పోవడం బాధాకరమే. అయినా మనమే మనిషితనాన్ని వదిలేసుకుంటున్నప్పుడు ఇక ఈ విలువలు, అనుబంధాలు, కుటుంబం అన్న పదాలు హాస్యాస్పదంగానే అనిపిస్తాయి. మనం మన పెద్దలకు ఇచ్చినదే రేపటి రోజున మన పిల్లలు మనకు ఇస్తారన్న విషయాన్ని గుర్తుంచుకుంటే కనీసం కొన్ని కుటుంబాలయినా నిలబడతాయి.

28/02/2024

సంతకం
విలువైనదే
బంధం
బలమైనది

అవసరాన్ని బట్టి
విలువల మార్పు..!!

Address

Eenadu Back Side
Vijayawada
520010

Website

Alerts

Be the first to know and let us send you an email when కబుర్లు కాకరకాయలు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share