Sydhul NewS - Tiruvuru

Sydhul NewS - Tiruvuru Sydhul News Tiruvuru

14/10/2025

బస్సులో మంటలు.. 15 మంది సజీవ దహనం

రాజస్థాన్లోని జైసల్మేర్లో ఘోర ప్రమాదం జరిగింది.

తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో బస్సులో మంటలు చెలరేగి 15 మంది సజీవ దహనమయ్యారు.

మృతుల్లో 3 ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో 25 మంది గాయపడ్డారు.

బస్సులో మొత్తం 57 మంది ఉన్నట్లు సమాచారం.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.








13/10/2025

తిరువూరులో వైసిపి మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు పి.సుధారాణి ఆధ్వర్యంలో నకిలీ మద్యంపై పట్టణంలో భారీ వర్షంలో సైతం కొనసాగిన ర్యాలీ.

నకిలీ మద్యం గుట్టు తేల్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు, పర్మిట్ రూం లు, బార్లు,బెల్ట్ దుకాణాలు తనిఖీలు చేపట్టాలి.

నకిలీ మద్యంపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

వైన్ షాపులను ప్రభుత్వమే నిర్వహించేలా చొరవ చూపాలి.

ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ నిక్సన్ కు వినతిపత్రం అందజేత.

ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళ విభాగ కార్యకర్తలు,పాల్గొన్న నాయకులు.









12/10/2025

పంట పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి..

తిరువూరు నియోజకవర్గ పరిధిలోని ఏ.కొండూరు తండాలో విషాదం నెలకొంది.

పంట పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి చెరువు నీళ్లలో ఉన్న తూములో ఇరుక్కుపోయి భూక్యా గోపయ్య (43) మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.








11/10/2025

తిరువూరులో బైక్ దగ్ధం,ప్రాణాలతో బయటపడ్డ తండ్రి కూతురు.

తిరువూరు వైపు నుండి కాకర్ల వెళ్తున్న బైకును వెనుక నుండి వచ్చి ఢీ కొన్న మరో మోటార్ వాహనం.

ప్రమాదంలో బజాజ్ బైక్ తగలబడగ బైక్ పై ప్రయాణిస్తున్న కాకర్ల గ్రామానికి చెందిన తండ్రి కూతురు పురం నరసింహస్వామి, శిరీష కొద్దిపాటి గాయాలతో సురక్షితం బయటపడ్డారు..

మరో వాహనం ఆంజనేయపురం కు చెందిన పల్సర్ బైక్ నడుపుతున్న కందుల కళ్యాణ్ తీవ్రగాయాలు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలింపు.

సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.











11/10/2025

లక్ష్మీదేవి గా కొలుసుకొనే ఆవులకు వింత వ్యాధి.

గోసంరక్షణ సభ్యులు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్న ప్రజలు.

మరణించ డానికి సిద్ధంగా వున్న మరొక అవుదూడ.. సాయిబాబా కల్యాణ మండపం దగ్గర...

తిరువూరు కృష్ణా థియేటర్ సెంటర్లో చర్మ వ్యాధి కారణంగా మృతి చెందిన ఆవుదూడ.

గత కొన్ని నెలలుగా పట్టణంలో ఆవులకు సోకుతున్న చర్మ వ్యాధులు.

వ్యాధిన పడిన పశువులను యజమానులు కనికరం లేకుండా రోడ్లపై వదిలేస్తున్న వైనం.

వ్యాధి సోకి మృతి చెందిన ఆవుదూడను చూసిన పశు ప్రేమికులు మాత్రం వాటి దీనస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

వ్యాధి సోకిన పశువులకు తగిన వైద్యం అందించి కాపాడాలని పట్టణవాసులు కోరుతున్నారు.

వాటి సంరక్షణ లేకుండా ఇష్టరాజ్యాంగ వదిలేసిన పశు యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న పట్టణ ప్రజలు.








11/10/2025

పెంపుడు కుక్క మరణం. శాస్త్రోత్తకంగా ఖననం

తిరువూరుకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి డి.రాంబాబు తన పెంపుడు శునకం మృతిచెందింది.

అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క చనిపోవడంతో పట్టణ శివారులో గొయ్యి త్రవ్వి ఖననం చేశారు.

శునకం మృతిపట్ల కొందరు విషాదం వ్యక్తం చేయగా యజమాని ప్రేమపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.





11/10/2025

తిరువూరు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షం.

ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం, తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు.

నెమలి-కొనిజర్ల మధ్య ఉన్న నల్లవాగుపై ప్రవహిస్తున్న వరదనీరు.పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు.

మల్లెల- లక్ష్మీపురం విస్సన్నపేటకు వెళ్ళే ప్రధాన రహదారిపై వెంకన్నవాగు అలుగు పొంగడంతో రాకపోకలకు ఏర్పడిన అంతరాయం.

తిరువూరులో తెల్లవారుజామున కురిసిన వర్షం 4.48 సెం.మీటర్లగా నమోదైంది.







08/10/2025

కోనసీమ జిల్లాలో బాణసంచా పరిశ్రమలో పేలుడు.. ఆరుగురి మృతి..

రాయవరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది..

బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందారు.








PM Narendra Modi Ji..Welcome Prime Minister Keir Starmer on your historic first visit to India with the largest ever tra...
08/10/2025

PM Narendra Modi Ji..

Welcome Prime Minister Keir Starmer on your historic first visit to India with the largest ever trade delegation from the UK. Looking forward to our meeting tomorrow for advancing our shared vision of a stronger, mutually prosperous future.








08/10/2025

విసన్నపేట మండలం పుట్రెల కోటయ్యగారి చెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి పడటంతో వేములపల్లి కోటేశ్వరరావు మృతి.






07/10/2025

ఫ్యాన్సీ షాపులో పాము కలకలం.

తిరువూరు పట్టణంలోని నీలం ఫ్యాన్సీలో పాము రాగా స్నేక్ క్యాచర్ ఉయ్యూరు జయప్రకాష్ (జనసేన డుంబు) ను సంప్రదించగా 6అడుగుల పామును చాకచక్యంగా బంధించారు.

ఫ్యాన్సీ షాపులో వారందరూ ముందుగా తీవ్ర భయాందోళన చెందగా పామును పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

పామును సురక్షితంగా తిరువూరు సమీప అడవుల్లో సురక్షితంగా వదిలారు.

పామును పట్టుకున్న డుంబును పలువురు అభినందించారు.







06/10/2025

విస్సన్నపేట పిచ్చి కుక్కల దాడులు,11 మందికి తీవ్ర గాయాలు.

రాజీవ్ నగర్ కాలనీ, చుండ్రుపట్ల గ్రామాల్లో ఒక్కసారిగా పగపట్టినట్లు కుక్కలు స్వైర విహారం చేసి దాడి చేయడంతో చిన్నారులు,పెద్దలు మొదలగుని 11 మందికి గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో పొందిన బాధితులు.









Address

Tiruvuru
Vijayawada
521235

Telephone

+919542200923

Website

Alerts

Be the first to know and let us send you an email when Sydhul NewS - Tiruvuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sydhul NewS - Tiruvuru:

Share