DDNewsAndhra - అధికారిక ఖాతా

DDNewsAndhra - అధికారిక ఖాతా Official DD NEWS ANDHRA PRADESH

02/09/2025

♦తమిళనాడు.. చెన్నైలోని సిటీ యూనియన్ బ్యాంక్ 120వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.

♦రాష్ట్రంలో ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu  అధికారులను...
02/09/2025

♦రాష్ట్రంలో ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu అధికారులను ఆదేశించారు.
♦ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎరువుల లభ్యత, ఉద్యాన పంటలు, మార్కెటింగ్‌ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

02/09/2025

♦కడప జిల్లా సీకేదిన్నె మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన అధునాతన స్మార్ట్ కిచెన్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి Nara Lokesh ప్రారంభించారు.

♦అమరావతిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసే అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu అధికారులన...
02/09/2025

♦అమరావతిలో కీలక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసే అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu అధికారులను ఆదేశించారు.
♦ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన CRDA సమావేశంలో ఏడు అంశాలకు ఆమోదం తెలిపారు.
♦రాజధాని పరిధిలో చేపట్టే కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.
♦గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్, రోప్ వే, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుల నిమిత్తం స్పెషల్ పర్పస్ వెహికల్ ఉపయోగపడుతుంది.

♦కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ల్యాప్‌టాప్ పథకం 2025- కింద ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంద...
02/09/2025

♦కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ల్యాప్‌టాప్ పథకం 2025- కింద ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని.. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర పత్రికా సమాచార కార్యాలయం ఖండించింది.

02/09/2025

♦కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ కాన్ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ 20వ గ్లోబల్ సస్టైనబిలిటి సమ్మిట్ లో పాల్గొన్నారు.

02/09/2025

♦విశాఖలో జరుగుతున్న ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సులో ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu పాల్గొన్నారు.

02/09/2025

♦విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో నిర్వహించిన “సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్”లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బహుమతులు ప్రదానం చేశారు.

02/09/2025

♦బీహార్ లో బీహార్ రాజ్య జీవిక నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్ ను ప్రధానమంత్రి Narendra Modi వర్చువల్ గా ప్రారంభించారు.

02/09/2025

♦సెమీకాన్ ఇండియా -2025 సందర్భంగా ప్రధానమంత్రి Narendra Modi మేక్ ఇన్ ఇండియా మైక్రో ప్రాసెసర్ చిప్ ను అందుకున్నారు.

02/09/2025

♦ఢిల్లీ యశో భూమిలో సెమీ కండెక్టర్ జాతీయ సదస్సును ప్రధానమంత్రి Narendra Modi ప్రారంభించారు.

02/09/2025

♦మంగళగిరి ఆరో బెటాలియన్‌ ప్రాంగణంలో 22వ బ్యాచ్‌ కానీన్, హ్యాండ్లర్ పాసింగ్ అవుట్‌ పరేడ్‌ లో రాష్ట్ర హోంమంత్రి అనితతో కలిసి రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా పాల్గొన్నారు.

Address

Vijayawada
520001

Alerts

Be the first to know and let us send you an email when DDNewsAndhra - అధికారిక ఖాతా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DDNewsAndhra - అధికారిక ఖాతా:

Share