Real Estate Tv

Real Estate Tv this is Real Estate Tv. It is a News Channel. all real estate related news and builders related articles are published this page. please like, share, comment.

19/03/2025

LRS 2020 - L2 Approved Fee intimation - Real estate Expert N Anjaiah


18/03/2025

hmda approved plots in future city || Sreekaram Farms Pvt Ltd



Srinivas Kaila

18/03/2025

hmda approved plots in future city || Sreekaram Farms Pvt Ltd
#

03/03/2025

LRS 2020 | ఈ కేటగిరీ ప్లాట్స్ కి మొత్తం ఫీజు కాకుండా 10% కలెక్ట్ చేయకండి Real Estate Expert Anjaiah









20/09/2024

హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి.. 21 గ్రామాల మీదుగా, భూముల ధరలకు రెక్కలు
హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధికి ఫోర్త్ సిటీ (ఫ్యూచర్‌ సిటీ) కీలకంగా మారుతుందని రేవంత్ ప్రభుత్వం విశ్వసిస్తోంది. నగర విస్తరణ కూడా ఎక్కువగా అటువైపే ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్‌ సిటీలో గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి సన్నాహాలు మెుదలుపెట్టింది. 21 గ్రామాల మీదుగా 40 కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్లుగా ఆ రహదారిని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.
హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. నగర అభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు సిటీలు ఉండగా.. ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించతలపెట్టారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ ప్రాంతాల్లో ఈ ఫోర్త్‌సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇక ఈ ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అక్కడ గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలిసింది. ఫ్యూచర్‌ సిటీలో స్కిల్‌ యూనివర్సిటీతో పాటుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ గ్రీన్ ఫీల్డ్ రహదారి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ ప్రణాళికలు, ట్రాఫిక్‌ అవసరాలను అనుసరించి కొత్తగా రహదారుల అనుసంధానం కోసం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసకుంది. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు 40 కి.మీ పొడవునా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.
ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్‌-13 రావిర్యాల నుంచి కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట వరకు మెుత్తం 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో మీర్‌ఖాన్‌పేట నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్‌ (RRR) వరకు ఈ రహదారిని అనుసంధానించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 21 గ్రామాల గుండా ఈ రహదారిని నిర్మించనున్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి సంబంధించి హెచ్‌ఎండీఏ (HMDA) ఇప్పటికే రోడ్‌ ఎలైన్‌మెంట్‌ను కూడా రూపొందించింది. రేవంత్ సర్కార్ ఆమోదం రాగానే ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిసింది.
ఫీల్డ్ రహదారి వెళ్లే గ్రామాలు..
ఇబ్రహీంపట్నం మండలంలోని నారేపల్లి, హఫీజ్‌పూర్, మజీద్‌పూర్, ఆదిభట్ల, దండుమైలారం, ఇబ్రహీంపట్నం ఖాల్సా, కొంగరకలాన్, కప్పపహాడ్, ఫిరోజ్‌గూడ, మహేశ్వరం మండలంలోని కొంగర ఖుర్ద్, కందుకూరు మండలంలోని రాచలూర్, తిమ్మాయిపల్లి, తుమ్మలూర్, గూడూరు, గుమ్మడవెల్లి, లేమూర్, మదాపూర్, మంఖాల్, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట గ్రామాల గుండా నిర్మించనున్నారు.

కాగా, గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి కొత్త కొత్త సంస్థలు రావటంతో పాటుగా భూముల ధరలకు రెక్కలు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఎకరం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు ధర పలుకుతుండగా.. మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

19/09/2024

అమరావతి..

*ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ*

*భూములు ఇవ్వడానికి ముందుకొస్తున్న రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అంగీకార పత్రాలు స్వీకరణ*

*రైతులకున్న అనుమానాలు నివృత్తి చేస్తూ వారికి భరోసా ఇస్తున్న మంత్రి*

*తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామ శివారులో సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్య నిమ్మ తోటలో నివాసం ఉంటున్న రైతు కుటుంబం వద్దకు వెళ్ళిన మంత్రి నారాయణ*

*CRDA కు ల్యాండ్ పూలింగ్ ద్వారా 4.91 ఎకరాల భూమిని మంత్రి చేతుల మీదుగా అప్పగించిన రైతు మెహబూబ్ సుభాని*

*....మీడియా తో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ...*

రాజధాని కోసం రైతులు కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు.

*గత ప్రభుత్వం మూడు ముక్కలాట తో పూలింగ్ కి కొంత భూమి ఇవ్వలేదు*

*గత రెండు రోజుల నుండి రైతుల వద్దకే వెళ్లి 17 ఎకరాలు తీసుకున్నాను*

*ఈ రోజు నిడమర్రు, కురగల్లు, రాయపూడి గ్రామాల్లో 21 ఎకరాలు ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చారు*

*ల్యాండ్ పూలింగ్ కి ఇచ్చిన వారికి 15 రోజుల్లోగా రిటర్న్ బుల్ ఫ్లాట్స్ కేటాయిస్తాము*

గతంలో లాటరీ విధానం ద్వారా రిటర్నబుల్ ప్లాట్ లు కేటాయించాం.

ఇప్పుడు ముందుగా భూమి ఇచ్చిన వారికి ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న ఫ్లాట్స్ ఇస్తాం.

రైతులకి నచ్చిన ఫ్లాట్స్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నాం

దేశంలో టాప్ 5 నగరాల్లో.. అమరావతి ఒకటి ఉండేలా చేస్తాం

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ...
19/09/2024

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీకి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు.

యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా గారు, కో-చైర్మన్ శ్రీని రాజు గారు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

✅ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీ లో భాగస్వామ్యం పంచుకోవాలని, యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీలు లేదా దాతల పేర్లను ఆ భవనాలకు పెట్టాలని అధికారులకు సూచించారు.

✅ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆలోచన, ఆశయాలతో పాటు పలు కీలక అంశాలను మంత్రి శ్రీధర్ బాబు గారు సమావేశంలో వివరించారు. యూనివర్సిటీలో కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత అక్టోబర్ నెలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించింది.

Chief Minister Sri A. Revanth Reddy has been formally invited to inaugurate STATCON-2024, the state-level conference org...
10/07/2024

Chief Minister Sri A. Revanth Reddy has been formally invited to inaugurate STATCON-2024, the state-level conference organized by CREDAI Telangana next month. The event aims to address various issues concerning the builders' community in the presence of key stakeholders.

Approximately 900 member developers from across Telangana are expected to attend. Office bearers of CREDAI Telangana, including Murali Krishna Reddy (Chairman), Premsagar Reddy (President), K. Indrasena Reddy (President-elect), Ajay Kumar (Secretary), and Jaganmohan (Treasurer), met with the Chief Minister at the Secretariat on Wednesday.

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onb...
29/06/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onboard! మహేష్ యాదవ్ జటంగి, Mamatha Chinny

ధరణి దరఖాస్తుల పై ఈ నెల 29న జిల్లా కలెక్టర్ లతో వీడియో conference
27/06/2024

ధరణి దరఖాస్తుల పై ఈ నెల 29న జిల్లా కలెక్టర్ లతో వీడియో conference

RRR UPDATES...తెలంగాణ సమగ్రాభివృద్ధికి కీలకమైన రహదారుల విస్తరణలో రాష్ట్రానికి అవసరమైన చేయూతను అందించాలని ముఖ్యమంత్రి శ్ర...
27/06/2024

RRR UPDATES...

తెలంగాణ సమగ్రాభివృద్ధికి కీలకమైన రహదారుల విస్తరణలో రాష్ట్రానికి అవసరమైన చేయూతను అందించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కేంద్ర రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు.

☑️ఈ సందర్భంగా రాష్ట్రంలో రోడ్ల విస్తరణకు సంబంధించి పలు ప్రతిపాదనలను అందించారు. 2024-25 వార్షిక ప్రణాళికలోనే ఈ రహదారులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి విన్నవించారు.

☑️ తెలంగాణ ఉత్తర భాగంలో అనుమతించిన రీజినల్ రింగ్ రోడ్డు (RRR) కు తక్షణమే టెండర్లు పిలవడంతో పాటు దక్షిణ భాగంలో చౌటుప్పల్ – ఆమన్ గల్ – సంగారెడ్డి వరకు 181 కిలోమీటర్ల ప్రతిపాదిత జాతీయ రహదారిని భారతమాల పరియోజన కింద గుర్తించి 2024-25 వార్షిక ప్రణాళిక కింద చేర్చాలి. తద్వారా రీజినల్ రింగ్ రోడ్డుకు పరిపూర్ణత చేకూరుతుంది.

☑️ హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్యన నాలుగు లేన్ల జాతీయ రహదారిని ఆరు లేన్ల రహదారిగా మార్చే ప్రాజెక్టును తక్షణం చేపట్టాలి.

☑️ వామపక్ష తీవ్రవాదం కారణంగా మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు, మాజీ స్పీకర్ శ్రీ శ్రీపాదరావు వంటి మహామహులు ప్రాతినిథ్యం వహించిన మంథని మార్గం జాతీయ రహదారి చిత్రపటంలో చోటు దక్కలేదని, జగిత్యాల – పెద్దపల్లి – మంథని – కాటారం 130 కిమీ మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తగిన నిధులు కేటాయించాలి.

☑️ జాతీయ రహదారి -163లో భాగంగా హైదరాబాద్ – మన్నెగూడ రహదారి కాంట్రాక్టు పనులు అప్పగించినప్పటికీ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరాల మేరకు పనులు నిలిచిపోయాయని, వాటిని తక్షణం పరిష్కరించి ఈ నాలుగు లేన్ల రహదారి పనులను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.

☑️ పలు జాతీయ రహదారులకు అనుసంధానం చేయడం, కొన్ని పుణ్యక్షేత్రాలకు అనుసంధానం చేస్తూ జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా జగిత్యాల – పెద్దపల్లి – కాటారం (130 కిమీ), డిండి – దేవరకొండ, మల్లేపల్లి-నల్గొండ (100 కిమీ), భువనగిరి – చిట్యాల (44కిమీ), మరికల్ – నారాయణపేట – రాంసముద్ర (63కిమీ), వనపర్తి – కొత్తకోట – గద్వాల – మంత్రాలయం (110 కిమీ), కరీంనగర్ – సిరిసిల్లా – కామారెడ్డి – ఎల్లారెడ్డి- పిట్లం (165 కిమీ), ఎర్రవల్లి ఎక్స్ రోడ్ – గద్వాల – రాయచూర్ (67 కిమీ), కొత్తపల్లి – జనగాం (75 కిమీ), సారపాక – ఏటూరునాగారం (93 కిమీ), దుద్దెడ – కొమురవెల్లి – యాదగిరిగుట్ట (63 కిమీ), జగ్గయ్యపేట – వైరా – కొత్తగూడెం (100 కిమీ), సిరిసిల్లా – వేములవాడ - కోరుట్ల (65 కిమీ), భూత్పూర్ – నాగర్ కర్నూల్ – మన్ననూరు – మద్దిమడుగు – సిరిగిరిపాడు (166 కిమీ), కరీంనగర్ – రాయపట్నం (60 కిమీ) మొత్తంగా 1617 కిలోమీటర్ల మేరకు రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి.

☑️ అత్యంత ప్రధానమైన హైదరాబాద్ – శ్రీశైలం NH765 మార్గం 187 కిమీ లలో 125 కిమీ పనులను మాత్రమే పునరుద్ధరణ జరిగిందని, మిగిలిన 62 కిమీ రహదారిని ఎలివేటెడ్ కారిడార్ గా 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చాలి.

☑️ హైదరాబాద్ – శ్రీశైలం NH765 మార్గాన్ని కల్వకుర్తి వరకు విస్తరించాలి.

☑️ సేతు బంధన్ పథకం కింద అత్యంత ప్రాధాన్యత కలిగిన 12 రోడ్ ఓవర్ బ్రిడ్జి, రోడ్ అండర్ బ్రిడ్జిలను ప్రస్తుత వార్షిక ప్రణాళికలో చేర్చాలి.

☑️ హైదరాబాద్ నుంచి భద్రాచలం దాదాపు 40 కిమీ దూరాన్ని తగ్గించడంతో పాటు అనేక ప్రయోజనాలున్న హైదరాబాద్ గౌరెల్లి ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి వలిగొండ – తొర్రూర్ – నెల్లికుదురు – మహబూబాబాద్ – ఇల్లందు – కొత్తగూడెం మధ్య 234 కిమీ మార్గం NH-930Pతో పాటు కల్వకుర్తి – నంద్యాల (ఏపీ) NH-167K పనులకు తక్షణం టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలి.

Address

Vikarabad
500060

Alerts

Be the first to know and let us send you an email when Real Estate Tv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share