14/09/2025
బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్, ఐపీయస్., గారికి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖ
👉ప్రజలు, పోలీసు యంత్రాంగం అందించిన సహకారం మరవలేను: జిల్లా ఎస్పీ గారు
ప్రకాశం జిల్లాలో 14 నెలలు పాటు ప్రజలకు ఉత్తమ పోలీసింగ్ సేవలందించడంలో, సిబ్బంది సంక్షేమంకు కృషి చెయ్యడంలో తనదైన ముద్ర వేసుకొని సాధారణ బదిలీలలో భాగంగా విజయనగరం జిల్లాకు ఎస్పీగా వెళుతున్న ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్, ఐపీయస్., గారికి పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఘనంగా ఆత్మీయ వీడ్కోల పెరేడ్ నిర్వహించి ఎస్పీ గారిను పూలమాలలు/గజామాల మరియు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ముందుగా పెరేడ్ కమాండర్ నుండి గౌరవవందనం స్వీకరించి, పెరేడ్ పరిశీలన అనంతరం ప్లటూన్ ల వారీగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి వారి నుండి ఆత్మీయ వీడ్కోలు తీసుకున్నారు. అనంతరం పోలీసు కవాతు వాహనం లో పెరేడ్ గ్రాండ్ నుండి ఛాంబర్ వరకు ఎస్పీ గారిని ఓపెన్ టాప్ జీపు పై ఊరేగించి పూల వర్షం కురిపించారు. పోలీసులు వాహనాన్ని జిల్లా అధికారులు అందరూ తాళ్లతో లాగి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, గత 14 నెలలు కాలంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి పోలీస్ అధికారులు, సిబ్బంది అందించిన సహకారం అభినందనీయమని అన్నారు. బదిలీల్లో భాగంగా ప్రకాశం జిల్లా నుండి వెళుతున్నప్పటికీ, మీ అందరి సేవలను ఎన్నడూ మరువలేనని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా శాంతి భద్రతల విషయంలో ప్రాముఖ్యతను పొందిందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా నిర్వహించామని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, మహిళలు–పిల్లలపై నేరాల అరికట్టడం, బందోబస్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో సిబ్బంది కృషి పోలీసు సేవాతత్వానికి అద్దం పట్టిందని ప్రశంసించారు. దీనికి హోంగార్డు స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ వరకు, డీపీఓ సిబ్బంది సహా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. సిబ్బంది సంక్షేమంలో భాగంగా మెడికల్ క్యాంపులు స్పోర్ట్స్ మేట్, తదితర కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. జిల్లా వదిలి వెళుతున్నప్పటికీ, ఎప్పుడైనా సహాయం కావాలంటే తన పరిధిలో చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మీరు ఎప్పటికి నామదిలో ఉంటారని సాధారణంగా బదిలీలు సర్వసాధారణమన్నారు. గత 14 నెలలు పాటు సహకరించిన ప్రజలకు, పాత్రికేయులకు, ఇతర శాఖల అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజయనగరం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్, డీజీపీ మరియు ఐజీ గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె.నాగేశ్వరరావు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కె.శ్రీనివాసరావు, ఒంగోలు డి.ఎస్.పి ఆర్. శ్రీనివాసరావు, దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి రమణ కుమార్, ఏ ఆర్ డి ఎస్ పి కె. శ్రీనివాసరావు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.