19/06/2020
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు...? ఇది పెద్దలు వాడిన సామెత, అక్షరాల మాదిగ జాతిలో నిజమైంది. ప్రపంచస్దాయి ఉధ్యమం., వార్డుస్దాయి ప్రయోజనాలు..! మాదిగ అని చెప్పుకోవడానికి తప్పా ఎందుకూ పనిరాని ఉధ్యమం మాదిగ ఉధ్యమం. మాదిగలకంటే మాదిగేతరులకే ఎక్కువ లబ్ది చేకూర్చినా ఎవ్వరూ గుర్తించని అమాయక ఉధ్యమం. మాదిగలకు, ఆర్ధికంగాగాని, రాజకీయంగాగాని ఏమాత్రం ఉపయోగపడలేదన్నది వాస్తవం. ఇంత పెద్ద ఉధ్యమం మాదిగలకు కనీసం ఇళ్ళస్దలాలు గానీ, మాదిగ పేదరైతు కూలీలకు కనీసం రెండెకరాలభూమి గానీ, కనీసం జిల్లాకి ఒక మాదిగ భవనం గానీ, మాదిగల జీవితాలు బాగుపరిచేందుకు చిన్నచిన్న పరిశ్రమలు స్దాపన గానీ, ఉధ్యమంలో పనిచేసి సర్వంకోల్పోయిన వారికి, కార్యకర్తలకు కనీసం ఎటువంటి రాజకీయ పదవులు గానీ, ప్రత్యేక కార్పోరేషన్ పెట్టించి మంచి బడ్జెట్ ను కేటాయించి మాదిగల అభివుృద్దికి ఏమాత్రం ఉపయోగం లేని ప్రపంచస్దాయి ఉధ్యమం నడిపిన ఘనత మన మాదిగలదే.., కాదంటారా..? మూలిగే నక్కపై తాటికాయ పడటం అంటే ఇదే. అసలే ఉపాదిలేక , రిజర్షేషన్ ఫలాలు అందక, కటిక పేదరికంతో అలమటించే జాతి ధన, మాన, ప్రాణాలు తీసిన ఉధ్యమం MRPSఉధ్యమం. కొందరి స్వార్ధపరుల అవకాశాలకే ఈ ఉధ్యమం ఉపయోగపడింది. మాల కులస్తులతో శాశ్వత శత్రుత్వం మిగిల్చింది., మాదిగ ఉధ్యోగులపై మాలల వేధింపులకు నిత్యకుృత్యమయింది. అవకాశవాదులకు, స్వార్ధపరులకు ఈ ఉధ్యమం ఎర్రతివాచీ పరచింది. జాతి ప్రయోజనాలను రాజకీయ నాయకులకు తాకట్టుపెట్టి మాదిగలను ఓటు బ్యాంకుగా మార్చింది. మాదిగ జాతికోసం ఉధ్యమాలు చేసే నాయకులు అందరు దాదాపుగా వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మాల వారితో బందుత్వం, చుట్టరికం కూడా ఉండటం విషేషం. ఇలాంటివారి నాయకత్వంలో మాదిగ జాతి సంక్షేమం ఎప్పటికీ సాధ్యంకాదు. ఎన్నికల్లో మన పక్షం ఓడినా , గెలిచినా ఎప్పుడూ మనది ప్రతిపక్ష పాత్రగానే చేసిన మన మహా ఘనులు మన నాయకులు. దురదుృష్టం ఏమిటంటే ఇప్పటికీ ఆ మహా నాయకునిది "సింగిల్ డిమాండే" .. ఇక ఈ జన్మలో జాతి బాగుపడదు. ఈ డిమాండ్ బహుశా ఆయనకు అత్యధ్బుతంగా కలిసొచ్చింది. ఏమైనా మనలో గొప్పచైతన్యమొచ్చింది. అది బాగుపడే చైతన్యం మాత్రం కనేకాదు. కేవలం మాట్లాడుకునే మరియు మాదిగ అనే చెప్పుకునే చైతన్యం మాత్రమే.. చివరిగా " ఆకలితో ఉన్న ఆత్మాభిమానం కానీ, ఆత్మగౌరవం లేని అన్నం రెండూ సమానమే,.. ఉధ్యమ నాయకత్వం మారాలి, ఉధ్యమ తీరు మారాలి, జర్నలిస్ట్ రమేష్ కుమార్ మొయ్యేటి.