17/08/2026
🌿ఈరోజు స్పెషల్ "అవిసి ఆకు ఫ్రై " ( Flaxy Leaf ) అవిసి గింజల కంటే ఆకు చాలా ఉపయోగకరం. చాలామందికి తెలియదు, దొరకదు, దొరికిన చేసుకోవడం చాలా సహనంతో కూడుకున్నది. అవిసి ఆకు అంటేనే ఆరోగ్యానికి మూలం, ఆయుర్వేదంలో కీలక ఔషధ గుణాలు కలిగిన ఆకు ఇది, మంచి క్యాల్షియం గుణాలు ఉంటాయి . ✍️*అవిసి గింజలు* 🌿 చిన్నవే కానీ శక్తి పెద్దది. కొంత రాయలసీమ జిల్లాలో వాడకం ఉంది. ఇందులో తెల్ల, ఎర్ర రెండు రకాలు ఉంటాయి. 🤝
*ఆరోగ్యానికి ఉపయోగాలు:*
*1. గుండెకు మంచిది*
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.
*2. జీర్ణశక్తి + మలబద్ధకం*
పీచు/fiber చాలా ఎక్కువ. రోజూ 1 స్పూన్ తీసుకుంటే పొట్ట శుభ్రంగా ఉంటుంది.
*3. షుగర్ కంట్రోల్*
బ్లడ్ షుగర్ లెవెల్స్ ని స్టెబుల్ గా ఉంచుతాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఉపయోగం.
*4. హార్మోన్ల బ్యాలెన్స్*
లిగ్నాన్స్ ఉంటాయి. ఆడవాళ్లకు PCOS, మెనోపాజ్ సమస్యలకు మంచివి.
*5. చర్మం + జుట్టు*
ఒమేగా-3 వల్ల చర్మం మెరుస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.
*6. బరువు తగ్గడానికి*
పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తాయి. అతిగా తినకుండా ఆపుతాయి.
*ఎలా చేసుకోవాలి అయ్యా?*
అవిశ ఆకు ఎంపిక చేసుకోవడమే ప్రదానం, ముదరా ఆకు కాదు, లేత ఆకు కాకుండా మధ్యాస్తంగా ఆకు ఉండాలి. ఆకుపై మచ్చలు, పురుగు లేకుండా చూసుకోవాలి. ఆకులు రెమ్మల నుండి వేరు చేసి, సైదవా లావణం ( కళ్ల ఉప్పు, రాళ్ళ ఉప్పు ) రెండు స్పూన్లు నీటిలో వేసి ఆకు మొత్తం నీటిలో మునిగేలా చూసి, శుభ్రం చేసి రెండు నిమిషాలు తర్వాత బయటకు తీసుకోవాలి. అవకాశం ఉంటే చిన్నగా అవిశి ఆకుని కట్టింగ్ చేసుకోవాలి. ఇనుప ముకిడీ లో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా వెల్లుల్లిపాయలు, నాలుగు ఎండుమిర్చి, తగినంత ఉప్పు, పోపు పప్పులు, ఆవాలతో సహా వేసుకొని వేపుకోవాలి. మనం సిద్ధంగా ఉంచుకున్న అవిశ ఆకును ఇనుప బండాలిలో వేసి కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టాలి. సన్న మంటలో అలా వేయించడం వల్ల ఆకు పచ్చివాసన పోతుంది. మరోపక్క వేరుశనగ గుళ్ళు, 4 ఎండుమిరపకాయలు దోరగా వేపుకుని , వేడి చల్లారిన తర్వాత కచ్చా, కచ్చగా ( భారకగా ) గ్రైండ్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఆకుకూర ఉడికి, బాగా అని తెలుసుకున్న తర్వాత సిద్ధంగా ఉంచుకున్న వేరుశనగ పప్పులు, మిరపకాయ మిశ్రమము ఆకు కూర తో కలిపి వేడివేడి అన్నంలో కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని తింటే ఆ మజా వేరు.. 🙏 మీరు ట్రై చేయండి.. మీ. 🤝వర్మ. జర్నలిస్ట్, వైజాగ్. ❤️