15/10/2025
విశాఖలో దేశంలోనే అతి పెద్ద డేటా సెంటర్ క్యాంపస్!
న్యూఢిల్లీ / విశాఖపట్నం, అక్టోబర్ 14:
అదానీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ, గూగుల్‌తో కలసి విశాఖపట్నంలో భారతదేశంలోనే అతి పెద్ద AI డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
USD 15 బిలియన్ (సుమారు ₹1.25 లక్షల కోట్లు) పెట్టుబడితో 2026–2030 మధ్య ఈ ప్రాజెక్ట్ పూర్తి కానుంది. గిగావాట్ స్థాయి డేటా సెంటర్ కార్యకలాపాలు, సబ్‌సీ కేబుల్ నెట్‌వర్క్, స్వచ్ఛ శక్తి వినియోగం వంటి ఆధునిక సదుపాయాలతో ఈ కేంద్రం అభివృద్ధి చేయబడుతుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశం యొక్క కృత్రిమ మేధస్సు (AI) రంగంలో పెద్ద ముందడుగు పడనుంది.
విశాఖపట్నంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అదానీ గ్రూప్ తో కొలాబరేట్ అయి ఫౌండేషన్ స్టోన్ వేశారు.. అయితే ఈ ప్రభుత్వం ఎక్కడ అదాని పేరు బయట రాకుండా గూగుల్ డేటా స్టోరేజ్ అని చెప్తుంది... మరి దీనిపై కూటమి నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే... పై ఫోటో చూడండి ఒకసారి చూస్తే మీకే అర్థం అవుతుంది.