Ted Media co

https://youtu.be/Yy2LmfNvdBQకొత్త జిల్లాల సరిహద్దులపై మీకు అభ్యంతరాలుంటే ఇలా ఫిర్యాదుచేయండి...  మన   ఛానెల్ లో పూర్తి సమ...
30/01/2022

https://youtu.be/Yy2LmfNvdBQ

కొత్త జిల్లాల సరిహద్దులపై మీకు అభ్యంతరాలుంటే ఇలా ఫిర్యాదుచేయండి... మన ఛానెల్ లో పూర్తి సమాచారంతో వీడియో... Please subscribe and like share comment your valuable feedback. Thankyou

ఆంధ్రప్రదేశ్ కొత్తజిల్లాల పునర్విభజనపై మీకు ఎటువంటి అభ్యంతరాలున్నా ప్రభుత్వానికి మీ అభిప్రాయాలను ఎలా తెలియ.....

కొత్త జిల్లాల సరిహద్దులపై మీకు అభ్యంతరాలుంటే ఇలా ఫిర్యాదుచేయండి... ఈరోజు 8.30 గంటలకు మన   ఛానెల్ లో...
30/01/2022

కొత్త జిల్లాల సరిహద్దులపై మీకు అభ్యంతరాలుంటే ఇలా ఫిర్యాదుచేయండి... ఈరోజు 8.30 గంటలకు మన ఛానెల్ లో...

29/01/2022

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన నేపధ్యంలో ఆ విషయంపై పూర్తి సమాచారంతో వీడియో రూపొందించాము.. వీడియో పూర్తిగా చూసి మీ సలహాలు సూచనలు ఇస్తారని మనవి.Our next video from our CHANNEL is about andhra pradesh new districts Reformation is out now. please be watch it and share it. Thankyou for supporting us.

https://youtu.be/aw_wAOFX5Yoముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం? జనవ...
26/01/2022

https://youtu.be/aw_wAOFX5Yo

ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం? జనవరి 26వ తారీఖున జరుపుకోవడానికి కారణాలు ఏమిటి? రాజ్యాంగ పరిషత్ ఎన్ని రోజులు పాటు శ్రమించి రాజ్యాంగం నిర్మించింది? మన రాజ్యాంగంలో ఏయే దేశాల నుండి ఏయే అంశాలను తీసుకుంది అనే అంశాలన్నింటికి ఈ వీడియోలో సంక్షిప్తంగా వివరణ ఇవ్వడం జరిగింది.

గణతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం? జనవరి 26వ తారీఖున జరుపుకోవడానికి కారణాలు ఏమిటి? రాజ్యాంగ పరిషత్ ఎన్న.....

గణతంత్ర దినోత్సవ సందర్బంగా మా TEDMEDIA ఛానెల్  నుంచి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను తెలిపే ప్రత్యేక వీడియో... jan 26 ఉదయం...
25/01/2022

గణతంత్ర దినోత్సవ సందర్బంగా మా TEDMEDIA ఛానెల్ నుంచి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను తెలిపే ప్రత్యేక వీడియో... jan 26 ఉదయం 9 గంటలకు...

Our next video from our CHANNEL is about importance of Republic day will out tomorrow morning 9Am please be watch it and share it. Thankyou for supporting us.

14/01/2022

second video from our channel is about in india. Please watch the entire video and comment your opinions. Thanks for supporting us.🙏

Our next video will be out today evening 6PM
14/01/2022

Our next video will be out today evening 6PM

We are very Glad to post Our Very first video on the channel. Please do support us. we will promise you that we will nev...
11/01/2022

We are very Glad to post Our Very first video on the channel. Please do support us. we will promise you that we will never disappoint you by our content. see this video and Subcribe to our channel. Like the video. share to others. and dont forget to click the bell icon.❤️

https://www.youtube.com/watch?v=YbIU-40NbLk

విశాఖ కబుర్లుజవాద్‌తో జాగ్రత్త..!తుపానుపై తీర ప్రాంత గ్రామాల వారికి సూచనలు చేస్తున్న అధికారులుగులాబ్‌ తుపాను చేసిన గాయం ...
03/12/2021

విశాఖ కబుర్లు

జవాద్‌తో జాగ్రత్త..!

తుపానుపై తీర ప్రాంత గ్రామాల వారికి సూచనలు చేస్తున్న అధికారులు

గులాబ్‌ తుపాను చేసిన గాయం మరిచిపోక ముందరే జవాద్‌ పేరుతో మరో తుపాను దూసుకొస్తోంది. ప్రత్యేకించి విశాఖ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు రోజుల క్రితమే కలెక్టర్‌ మల్లికార్జున ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు సమావేశమై తుపాను ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచర్యణను సిద్ధం చేశారు. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రచారం చేపట్టారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచనల మేరకు పోలీసు అధికారులు సముద్రతీర ప్రాంతాలకు వెళ్లి మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సిమెంట్‌ బస్తాలతో సిద్ధం..
గతంలో జరిగిన వరద నష్టాలను అంచనా వేసుకుని జలవనరుల శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుల వద్ద డీఈ, జేఈ, ఏఈలతో కూడిన బృందాలు తుపాను ప్రభావం తగ్గే వరకు అక్కడే అందుబాటులో ఉండేలా ప్రణాళిక చేసుకున్నారు. గండ్లు పడేలా ఉన్నచోట ఇసుక బస్తాలను సిద్ధం చేసుకుని ఉండాలని ఎస్‌ఈ సూర్యకుమార్‌ తమ సిబ్బందికి సూచించారు.

పంటల రక్షణపై..
ప్రస్తుతం 2,800 హెక్టార్లలో వరి కోతలు పూర్తయ్యాయి. వీటిలో సుమారు 1000 హెక్టార్లలో కోసిన పనలు ఉన్నాయి. తుపాను వేళ ఈ పంటలను ఎలా రక్షించుకోవాలనే విషయమై క్షేత్రసిబ్బందితో అవగాహన కల్పిస్తున్నామని జేడీ లీలావతి తెలిపారు. తుపాను నష్టాలు, పంటల రక్షణకు సంబంధించి 83310 56460, 83310 56468, 83310 56475 నంబర్లతో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తాండవ గేట్లు ఎత్తేయండి : ఆర్డీఓ
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాండవ జలాశయం గేట్లను ఎత్తి ఎప్పటికప్పుడు నీటిని దిగువకు వదిలేయాలని ఆర్డీఓ గోవిందరావు గురువారం ఆదేశాలు జారీ చేశారు. జలాశయాన్ని గురువారం సందర్శించిన ఆయన ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదను అంచనా వేస్తూ నదీపరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తహసీల్దారు, జలవనరుల శాఖ ఏఈ పాల్గొన్నారు.

విద్యుత్తు సమస్యలు లేకుండా..
తుపాను ప్రభావంతో బలమైన గాలులు వీచే సమయంలో విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే ఏర్పాట్లు చేసినట్లు ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ సూర్యప్రతాప్‌ చెబుతున్నారు. 50 కి.మీ కంటే వేగంగా గాలులు వీచే సమయంలో సరఫరా నిలిపేయనున్నట్లు తెలిపారు. సమస్యలపై సమాచారం ఇవ్వడానికి అనకాపల్లి డివిజన్‌ పరిధిలో 99632 12475, నర్సీపట్నం డివిజన్‌లో 94910 30714, పాడేరు డివిజన్‌లో 94906 10026 నంబర్లతో కంట్రోల్‌ రూమ్‌లు ఉంటాయని వివరించారు.

విశాఖ కబుర్లుఉక్కు కర్మాగారానికి.. అపూర్వ హోదావిశాఖ ఉక్కు కర్మాగారానికి ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌’(డి.జి...
28/11/2021

విశాఖ కబుర్లు

ఉక్కు కర్మాగారానికి.. అపూర్వ హోదా

విశాఖ ఉక్కు కర్మాగారానికి ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌’(డి.జి.ఎఫ్‌.టి.) అధికారులు ‘ఫోర్‌స్టార్‌ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌’గా అపూర్వ హోదా ప్రకటించారు. భారత విదేశీ వాణిజ్య విధాన ప్రకారం వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల కాలం పాటు ఏటా 500 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఎగుమతులు చేస్తే ‘ఫోర్‌స్టార్‌’ హోదా దక్కుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్రలో ఇప్పటివరకు ఆ స్థాయి ఎగుమతులు చేయలేదు. దీంతో ‘త్రీస్టార్‌’ కేటగిరీలోనే ఉండిపోయింది. తాజాగా 500 మిలియన్‌ డాలర్ల ఎగుమతుల మార్కును వరుసగా రెండేళ్లపాటు దాటిన నేపథ్యంలో డి.జి.ఎఫ్‌.టి. అధికారులు ‘ఫోర్‌స్టార్‌’ హోదా ప్రకటించారు. ఆమేరకు సంస్థకు లేఖను పంపారు. తాజా హోదా 2026 అక్టోబరు 21వ వరకు కొనసాగుతుంది. సంస్థ మార్కెటింగ్‌ విభాగానికి ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.

విశాఖ కబుర్లుకలుషిత ఆహారంపై ఆందోళనపాడేరు కస్తూర్బాలో సోమవారం రాత్రి  విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే సమాచారంతో తల్ల...
23/11/2021

విశాఖ కబుర్లు

కలుషిత ఆహారంపై ఆందోళన

పాడేరు కస్తూర్బాలో సోమవారం రాత్రి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే సమాచారంతో తల్లిదండ్రులు కలవరపాటుకు గురయ్యారు. మాజీ మంత్రి మణికుమారి, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి, విద్యార్థి సంఘాల ప్రతినిధులు బాలికలను పరామర్శించారు.

మందు బిళ్లల వాసనొచ్చింది
భోజనం చేసేందుకు సాయంత్రం 6-30 గంటల సమయంలో మెస్‌ దగ్గరకు వెళ్లాం. మొదట విడతలో ఆహారం తీసుకుంటున్న కొంత మంది విద్యార్థులు ఒకటి. రెండు ముద్దలు నోట్లో పెట్టిన తర్వాత మందు బిళ్లలు కలిసినట్లు వాసన వచ్చింది. ఆహారం తీసుకున్న కొద్ది సమయానికి తల తిరిగి వాంతులు వచ్చినట్లు ఒక్కొక్కరుగా మూర్ఛ పోయారు.
- రమాదేవి, పదో తరగతి

పారిశుద్ధ్యం బాగోలేదు...
పాఠశాలలో పారిశుద్ధ్యం ఏమాత్రం బాగోలేదు. ట్యాంకులో ఉన్న నీరును సకాలంలో శుభ్రం చేయడం లేదు. పర్యవేక్షణ సరిగ్గా లేకనే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నాం.
- నాగమ్మ, విద్యార్థిని తల్లి

అందరికీ వైద్య పరీక్షలు చేయిస్తున్నాం..
రోజూ మాదిరి విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు రాత్రి భోజనం సిద్ధం చేశారు. భోజనం చేస్తున్న కొందరు అమాంతంగా కళ్లు తిరిగి పడిపోవడంతో నాకు సమాచారం అందించారు. తక్షణమే ఆసుపత్రికి వచ్చాం. ముందు జాగ్రత్తగా విద్యార్థులందరికీ వైద్య సేవలు అందిస్తున్నాం.
- రత్నం, ప్రత్యేకాధికారి, కేజీబీవీ, పాడేరు

విశాఖ కబుర్లునా రాజకీయ ప్రస్థానానికి పునాది విశాఖలోనేనగరానికి నా హృదయంలో ప్రత్యేక స్థానంఅద్దాల రైలులోని ప్రయాణికులకు అభి...
23/11/2021

విశాఖ కబుర్లు

నా రాజకీయ ప్రస్థానానికి పునాది విశాఖలోనే

నగరానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం

అద్దాల రైలులోని ప్రయాణికులకు అభివాదం చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విశాఖతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి గుర్తు చేసుకున్నారు. విశాఖ రైలు నిలయంలో సోమవారం 13 బోగీలతో ఎల్‌హెచ్‌బీ (లింక్‌ హాఫ్‌మెన్‌ బుష్చ్‌)గా ఆధునికీకరించిన విశాఖ-కిరండూల్‌-విశాఖ రైలును ప్రారంభించిన సందర్భంగా విశాఖతో ఉన్న బంధాన్ని వివరించారు.

ఈ నగరం ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడే మూడేళ్లు విశ్వవిద్యాలయంలో చదువుకున్నా. ఏడాది పాటు విశ్వవిద్యాలయ రాజకీయాల్లో పాల్గొన్నా. ‘అత్యవసర పరిస్థితి’ రోజుల్లో దాదాపు 17 నెలలు ఇక్కడి జైల్లో పెట్టారు. ఆ సమయంలో ఎందరో పెద్దలతో అనుబంధం ఏర్పడింది. తరువాత ఎన్నికల్లో పోటీ చేశా. ఒకరకంగా నా రాజకీయ భవిష్యత్తుకు పునాది విశాఖలోనే పడిందనుకుంటున్నా. అందుకే నా హృదయంలో విశాఖకు ప్రత్యేక స్థానం ఉంటుంది’ అని పేర్కొన్నారు. రైలును ప్రారంభించే ముందు ప్రయాణికులను కలిసేందుకు విద్యుత్తు వాహనంలో అద్దాల బోగీల వద్దకు వెళ్లారు. కొత్తగా రూపొందించిన బోగీలను పరిశీలిస్తూ పర్యాటకులను పలకరించారు. అనంతరం పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు.
‘కొత్తవలస-కిరండూల్‌ మార్గంలో గుహలు, వంతెనలు ఇంజినీరింగ్‌ అద్భుతం. వాటిని చూస్తూ అద్దాల బోగీల్లో వెళ్లడం గొప్ప అనుభూతి కలిగిస్తుంది. అద్దాల బోగీల రైలు ప్రారంభించడం ఆలస్యం అవుతుందనే సమాచారం ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల ప్రతినిధుల ద్వారా తెలిసింది. వెంటనే విశాఖకు ప్రాధాన్యం ఇవ్వాలని రైల్వే శాఖ మంత్రికి కొన్ని సూచనలు చేయగా...తక్షణం దీన్ని అమలులోకి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మంత్రికి అభినందనలు’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

కొవిడ్‌ సమయంలో: కొవిడ్‌ సమయంలో వాల్తేరు డివిజన్‌ ప్రశంసనీయమైన సేవలందించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ చేసిన మార్పులు అభినందనీయమన్నారు. శుభ్రత విషయంలో విశాఖ స్టేషన్‌ 2017లో ఉత్తమంగా నిలిచిందని ఆ పేరు నిలబెట్టుకోవాలన్నారు. అంతకుముందు తూర్పుకోస్తా రైల్వే జీఎం అర్చనా జోషి భారతీయ రైల్వేలో తూర్పుకోస్తా ప్రగతిని వివరించారు. డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సతపతి ముగింపు ఉపన్యాసం చేశారు. మేయర్‌ హరివెంకటకుమారి, ఎంపీ సత్యవతి, ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు.

భద్రత నడుమ నడక
నా రాజకీయ ప్రస్థానానికి పునాది విశాఖలోనే
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సిరిపురం కూడలి-ఏయూ అవుట్‌గేట్‌ మధ్య సోమవారం ఉదయపు నడకకు వచ్చారు. భద్రతా సిబ్బంది నడుమ నడుస్తూ...ఎదురుగా వచ్చిన పలువురికి నమస్కరిస్తూ ముందుకు సాగారు. మధ్యలో టీ దుకాణదారులతోనూ ముచ్చటించారు.

విశాఖ కబుర్లుఅరుపులు.. కేకలు!పోలీసుల సూచనతో వరుసలో ఉన్న అభ్యర్థులు‘ఈసెట్‌’లో ర్యాంకు సాధించి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో రెం...
20/11/2021

విశాఖ కబుర్లు

అరుపులు.. కేకలు!

పోలీసుల సూచనతో వరుసలో ఉన్న అభ్యర్థులు

‘ఈసెట్‌’లో ర్యాంకు సాధించి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో రెండో ఏడాదిలో చేరేందుకు అర్హత సాధించిన పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో అరుపులు... కేకల మధ్య జరిగింది.

పత్రాల పరిశీలనకు జిల్లాలోని అభ్యర్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. చివరి రోజు సమయం దాటిపోతుందనే ఆందోళనతో కొందరు, ఇప్పటికే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా అండర్‌ ప్రాసెస్‌, అండర్‌ పెండింగ్‌ అంటూ సూచించడంతో ఆందోళన చెందినవారంతా హెల్ప్‌లైన్‌ సెంటరులోకి దూసుకొచ్చారు. ఇద్దరు పోలీసులు, పాలిటెక్నిక్‌ సిబ్బంది వారిని నిలువరించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. తోపులాటలో గేటు వద్ద పెట్టిన బెంచీ విరిగిపోయింది. కొంతసేపు గందరగోళ పరిస్ధితులు తలెత్తాయి. అభ్యర్థులను వరుసలో నిల్చోమని, అందరినీ లోపలకు పంపుతామని ప్రిన్సిపల్‌ డి.ఫణీంద్రప్రసాద్‌ పదే పదే మైకులో చెప్పినా చాలా మంది పట్టించుకోలేదు. తరువాత మరింత మంది పోలీసులు వచ్చి వందలాది మంది విద్యార్ధులను బయటకు పంపి వరుసలో నిల్చోపెట్టి ఒక్కొక్కరినీ లోపలికి అనుమతించారు.

విశాఖ కబుర్లుఎయిడెడ్‌ విద్యా సంస్థలను రక్షించాలిఎయిడెడ్‌ విద్యాసంస్థలను పరిరక్షించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు...
17/11/2021

విశాఖ కబుర్లు

ఎయిడెడ్‌ విద్యా సంస్థలను రక్షించాలి

ఎయిడెడ్‌ విద్యాసంస్థలను పరిరక్షించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ ప్రణవ్‌గోపాల్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రణవ్‌గోపాల్‌ మాట్లాడుతూ ఎయిడెడ్‌ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేందుకు జారీ చేసిన జీవో నెంబరు 42, 50, 51లను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల ఆస్తులు, భూములను దోచుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను రోడ్డు కీడుస్తున్నారన్నారు. పోలీసులతో విద్యార్థుల ఉద్యమాలను అణిచివేయాలనే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కార్తీక్‌, ఎస్‌.రతన్‌కాంత్‌, జోస్‌యాదవ్‌, దేవర శివ, అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ కబుర్లుకమ్ముకొస్తోంది.. చీకటి ముప్పు!ప్రభుత్వ కార్యాలయమైనా కట్టాల్సిందే!!తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థకు (...
14/11/2021

విశాఖ కబుర్లు

కమ్ముకొస్తోంది.. చీకటి ముప్పు!

ప్రభుత్వ కార్యాలయమైనా కట్టాల్సిందే!!

తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థకు (ఈపీడీసీఎల్‌) బకాయిలు గుదిబండగా మారుతున్నాయి. వేలు, లక్షలు కాదు.. ఏకంగా రూ. 150 కోట్లకు పైగా విద్యుత్తు బిల్లులు జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల నుంచి వసూలు కావాల్సి ఉంది.
ప్రతినెలా ఇవి అంతకంతకు పెరుగుతుండటంపై రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిర్ణీత గడువులోగా ఆ బిల్లులు చెల్లించకుంటే ప్రభుత్వ, స్థానిక సంస్థలకు విద్యుత్తు సరఫరా నిలిపేయాలని డిస్కంలను ఆదేశించింది. దీంతో ఈపీడీసీఎల్‌ అధికారులు ఎలాగైనా వసూలు చేయాలని భావిస్తున్నారు. మరో వైపు కార్యాలయాల నిర్వహణకే సొమ్ములు లేకుంటే కరెంటు బిల్లులు ఎలా చెల్లించగలమని పలువురు అధికారులు అంటున్నారు.
జిల్లాలో అన్ని రకాల విద్యుత్తు కనెక్షన్లు 16,71,979 వరకు ఉన్నాయి. వీటి నుంచి ప్రతినెలా సుమారు రూ. 410 కోట్లు బిల్లుల రూపంలో వసూలు కావాలి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుతు వినియోగదారులు ప్రతినెలా బిల్లులు చెల్లించేస్తుంటారు. ఒకవేళ చెల్లించకుంటే విద్యుత్తు సరఫరా నిలిపేస్తుంటారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల విషయంలో మాత్రం దూకుడుగా వెళ్లలేకపోతున్నారు. ప్రభుత్వ సంస్థలే కదా ఎప్పుడో ఒకనాడు చెల్లిస్తాయని భావిస్తున్నారు. దీంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. వీటిని వసూలు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా పెద్దగా స్పందన ఉండటం లేదు. తాజాగా కరెంటు సరఫరా నిలిపేయాలని విద్యుత్తు నియంత్రణ మండలి ఆదేశించడం చర్చనీయాంశమవుతోంది.

* నిధులు వస్తేనే: జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు సంబంధించి 26,849 విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి గత నెలాఖరు నాటికి సుమారు రూ. 153 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని ఈపీడీసీఎల్‌ అధికారులు తేల్చారు. వీటిలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ. 46 కోట్లు ఉంటే అత్యధికంగా స్థానిక సంస్థల నుంచి రూ. 107 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వానికి బిల్లులు పెడుతున్నామని, అక్కడి నుంచి నిధులు మంజూరు చేస్తే చెల్లించగలమని అంటున్నారు.

కొన్ని శాఖల వారీగా విద్యుత్తు బకాయిలు (రూ. కోట్లలో)
వైద్యారోగ్య శాఖ 6.51
గ్రామీణ నీటి సరఫరా 1.18
విద్యా శాఖ 7.87
సాంఘిక సంక్షేమం 2.39
ఇతర శాఖలు 5.95
పంచాయతీలు 99.72
మున్సిపల్‌ కార్పొరేషన్‌ 1.29
పురపాలక సంఘాలు 6.26

నోటీసులిస్తాం...
బకాయిలపై ఏపీఈఆర్‌సీ స్పష్టంగా చెప్పింది. వారి సూచనల మేరకు బకాయిపడిన సంస్థలన్నింటికి ముందు నోటీసులు ఇస్తాం. 14 రోజుల్లోగా చెల్లించకుంటే తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన లెక్కలు సిద్ధం చేస్తున్నాం.
- సూర్యప్రతాప్‌, ఎస్‌ఈ, ఈపీడీసీఎల్

విశాఖ కబుర్లువిశాఖలో భూ ప్రకంపనలువిశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అక్కయ్యపాలెం, మధురానగర్‌, బ...
14/11/2021

విశాఖ కబుర్లు

విశాఖలో భూ ప్రకంపనలు

విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అక్కయ్యపాలెం, మధురానగర్‌, బీచ్‌రోడ్డు, తాటిచెట్లపాలెం, అల్లిపురం, ఆసిల్‌మెట్ట, సీతమ్మధార, గురుద్వారా, రైల్వేస్టేషన్‌, బీచ్‌ రోడ్డు, హెచ్‌బీకాలనీ, జ్ఞానాపురం, బంగారమ్మమెట్ట, సింహాచలం, అడవివరం, గోపాలపట్నం ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.

విశాఖ ఓల్డ్ టౌన్‌తో పాటు, ఫిషింగ్ హార్బర్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ శబ్దంతో ఉదయం 7.15 గంటల సమయంలో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శాంతిపురం ఎన్జీవోస్‌ కాలనీలో భవనాల శ్లాబ్‌ పెచ్చులు ఊడి పడ్డాయి. భూ ప్రకంపనలపై భూగర్భ శాస్త్రవేత్తలు వివరాలు వెల్లడించాల్సి ఉంది.

విశాఖ కబుర్లువసూల్‌ రాజాలు.. ఎంతకైనా తెగిస్తారు!ఇటీవల పద్మనాభం మండలానికి చెందిన లైన్‌మెన్‌ మొల్లి బంగార్రాజు హత్య సంచలనం...
11/11/2021

విశాఖ కబుర్లు

వసూల్‌ రాజాలు.. ఎంతకైనా తెగిస్తారు!

ఇటీవల పద్మనాభం మండలానికి చెందిన లైన్‌మెన్‌ మొల్లి బంగార్రాజు హత్య సంచలనం సృష్టించింది. దానివెనుక షిప్టు ఆపరేటర్ల పోస్టుల కోసం సొమ్ముల వసూలు వ్యవహారమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మధ్యవర్తిగా ఉండి వసూళ్లు చేయడం.. ఆ తరవాత పోస్టులు వేయించలేక అవతలి వారిపై ఒత్తిడి తేవడంతో హత్యకు దారితీసినట్లు స్పష్టమవుతోంది. ఈ హత్యతో విద్యుత్తు శాఖలో షిఫ్టు ఆపరేటర్ల పోస్టుల వసూళ్ల బాగోతం బహిర్గతమైంది.
జిల్లాలో అన్నిచోట్లా షిఫ్ట్‌ ఆపరేటర్ల భర్తీ వ్యవహారం వసూల్‌రాజాల చేతులమీదుగానే సాగుతోంది. గతంలో గుట్టుచప్పుడు కాకుండా ఈ పోస్టులను అమ్ముకునేవారు. ఇటీవల కాలంలో బహిరంగంగానే బేరాలు పెట్టి వసూళ్లు చేయిస్తున్నారు. వీటి వెనుక పెద్దలే ఉండడంతో సొమ్ములు తీసుకుని పోస్టులు ఇవ్వకపోయినా బయటపడడానికి బాధితులు ముందుకు రాలేకపోతున్నారు.

విద్యుత్తు సబ్‌స్టేషన్ల నిర్వహణను టెండర్ల ద్వారా గుత్తేదారులకు అప్పగిస్తారు. ఈ క్రమంలో ఆయా సబ్‌స్టేషన్ల సామర్థ్యం బట్టి ముగ్గురు నుంచి ఎనిమిది మంది షిఫ్టు ఆపరేటర్లను గుత్తేదారే నియమిస్తాడు. అయితే ఆ సబ్‌స్టేషన్‌ పరిధిలోని అధికార పార్టీ నేతలు సూచించిన వారికే ఈ కొలువులు ఇస్తారు. నేతలు శాసిస్తారు.. మధ్యవర్తులుగా ఉన్నవారు సొమ్ములు వసూళ్లు చేస్తుంటారు. గతంలో రూ.4 లక్షలు పలికే ఈ పోస్టుకు తాజాగా రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఒప్పంద ఉద్యోగమే అని నిరుద్యోగులకు తెలుసు. అయినా ఇందులో చేరిన తరువాత విద్యుత్తు సంస్థలో ఎప్పుడైనా ఉద్యోగాలు తీస్తే తమకు ప్రాధాన్యం ఇస్తారనే ఆశతో సొమ్ములెంతైనా చెల్లించడానికి సిద్ధమైపోతున్నారు.
సబ్‌స్టేషన్‌ మంజూరైతే పండగే.. పెరుగుతున్న విద్యుత్తు వినియోగం ఆధారంగా ఏటా కొన్ని సబ్‌స్టేషన్లను నిర్మిస్తుంటారు. ఆయా సబ్‌స్టేషన్ల నిర్మాణానికి పునాది రాయి పడకముందరే కొంతమంది ఈ పోస్టులను బేరాలు పెట్టేస్తుంటారు. గతంలో బుచ్చెయ్యపేట మండలంలోని ఓ సబ్‌స్టేషన్‌లో షిఫ్టు ఆపరేటర్‌ నియామకం విషయమై స్థానిక నేతల మధ్యనే విభేదాలు రావడంతో సొమ్ములు తీసుకున్న వ్యక్తికి వెనక్కి ఇచ్చేసే పరిస్థితి వచ్చింది. పాయకరావుపేట నియోజకవర్గంలోనూ గతంలో ఈ పోస్టుల అమ్మకాల వ్యవహారం వెలుగుచూసింది. 2019లో సచివాలయ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ సమయంలో ఖాళీ అయిన షిఫ్టు ఆపరేటర్ల పోస్టులకు కొందరు నేతలు భారీగానే వసూళ్లు చేశారు. గతేడాది కాలంగా కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణాలు జరగలేదు. నక్కపల్లి, రాంబిల్లి క్లస్టర్లలో రెండు స్టేషన్లు మంజూరై ఉన్నాయి. ఇంకా ఇవి కార్యరూపం దాల్చక ముందే అక్కడి పోస్టుల కోసం కొందరు ఇప్పటి నుంచే నేతల చుట్టూ తిరుగుతున్నారు.

రెస్కో నియామకాలపైనా...
కశింకోటలో ఉన్న గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థ (రెస్కో)లో కూడా తాత్కాలిక ఉద్యోగుల నియామకాలపైనా పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ తాత్కాలిక ఉద్యోగులుగా 229 మందిని దశల వారీగా విధుల్లోకి తీసుకున్నారు. వీరిలో చాలా మంది దగ్గర రూ.6 లక్షలు నుంచి రూ.8 లక్షలు వరకు ఓ నేత వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఏడాది రెస్కోను ఈపీడీసీఎల్‌లో విలీనం చేశారు. ఈ విలీనానికి కొద్దిరోజుల ముందు కూడా 32 మంది దగ్గర సొమ్ములు తీసుకుని నియామకాలు చేశారనే ప్రచారం జరుగుతోంది. వీరిలో కొంతమందికి జీతాలు కూడా రావడం లేదు.. నేడో రేపో వారంతా ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ నియామకాలపై విచారణ జరిపిస్తే చాలావరకు అక్రమాలు వెలుగు చూస్తాయని విద్యుత్తు వినియోగదారుల సంఘాల నేతలంటున్నారు. అయితే రెస్కోలో నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడా నియామకాలు జరగలేదని, వసూళ్లకు పాల్పడినట్లు తమ దృష్టికి రాలేదని ఎండీ కృష్ణంరాజు చెబుతున్నారు. షిప్టు ఆపరేటర్ల ఎంపిక గుత్తేదారుల ఇష్టప్రకారం చేసుకోవచ్చని, రిజర్వేషన్‌ పాటిస్తున్నారా.. విద్యార్హత ఉందా అన్న విషయమే పరిశీలిస్తామని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ సూర్యప్రతాప్‌ అంటున్నారు.

రానురాను పోటీ పెరగడంతో ఒకట్రెండు పోస్టులకు 10 నుంచి 15 మంది నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారు. అందులో పోస్టులు వచ్చిన వారి సొమ్ములు మినహాయించుకుని మిగతా వారికి ‘సారీ’ చెబుతున్నారు. ‘ఈసారికి రాలేదు, తర్వాత చూద్దాం.. మీరిచ్చిన దాంట్లో కొంత ఖర్చయిపోయింది’ అంటూ ఒకటి రెండు లక్షలు తగ్గించి ఇచ్చేస్తున్నారు. ఎంతోకొంత వెనక్కి ఇచ్చారు కదా అని వారు పెద్దగా వ్యతిరేకించడం లేదు.

Address

303F Ukkunagaram

530032

Alerts

Be the first to know and let us send you an email when Ted Media co posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share