
02/04/2025
విజయనగరం, 02ఏప్రిల్ 2025...
వెల్లువెత్తిన అభిమానం... ప్రముఖులు, అభిమానుల రాష్ట్ర మరియు ఉత్తరాంధ్ర నలుమూలలు నుంచి వచ్చి జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భీమిలి అసెంబ్లీ ఇన్చార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి కుమారుని కీర్తి శేషులు ఆదిత్య ప్రణీత్ బాబు పెద్ద కర్మ కార్యక్రమంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
స్వార్థం కోసం కాక, ప్రజా సంక్షేమం కోసం రాజకీయం చేసే నాయకుడే నిజమైన ప్రజానేత.అధికారంలో ఉన్నప్పుడు కాదు, అధికారం లేనప్పటికీ ప్రజల మధ్య ఉండి,వారి కష్టసుఖాలను పంచుకుంటూ, వారి సమస్యలకు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే నాయకుడే ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. ఈ మాటకు నిజమైన నిదర్శనంగా నిలిచిన వ్యక్తి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) గారు.
అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేశిన "చిన్న శ్రీను, ఉత్తరాంధ్రలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా, ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల రీజినల్ ఉప కోఆర్డినేటర్‌గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.రాజకీయాల్లో ఉన్నప్పటికీ మానవీయతను మరిచిపోకుండా ప్రజల కష్టసుఖాల్లో నిత్యం పాలుపంచుకుంటూ, ప్రజా సేవను తన ధ్యేయంగా మార్చుకున్నారు.
ఇటీవల జరిగిన విషాద ఘటనలో ఆయన తన కుమారుడిని కోల్పోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయనకు ఉన్న ప్రజాభిమానాన్ని మరోసారి రుజువు చేశాయి. ఆయన కుమారుడు ఆదిత్య ప్రణీత్ బాబు కొద్దిరోజుల క్రితం పరమపదించగా, ఈ రోజు దినకర్మ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఒక నేతకు రాజకీయాలకు అతీతంగా ప్రజల మద్దతు ఉండాలంటే,ఆయన నడవడిక,సేవా లక్ష్యం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంటుందో తెలియజేసే ఘటన ఇది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాల నుండి వచ్చిన తండోపతండాలుగా తరలివచ్చిన అభిమాన జనసందోహం "చిన్న శ్రీను" గారి ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచింది.
ఒక తండ్రిగా కుమారుడి కోసం ఏకక్షణం వెనుకాడకుండా, అత్యుత్తమ వైద్యం అందిస్తూ ప్రాణాలను నిలుపుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, విధి తన కఠినతరమైన తీర్పును ఇచ్చింది. అయినప్పటికీ ధైర్యాన్ని కోల్పోకుండా,పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించటం, తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికీ సహాయసహకారాలు అందించటం నిజమైన నాయకునిగా *చిన్న శ్రీను* గారి గొప్పతనాన్ని వెల్లడిస్తోంది.
ఆయన తన కుటుంబాన్ని కోల్పోయిన సమయంలో, దుఃఖ సమయాల్లో ప్రజల అండగా నిలవడం మరోసారి ఆయనకున్న ప్రజాదరణను రుజువు చేసింది.రాజకీయాల్లో గెలుపోటములు సహజమే, కానీ ప్రజల గుండెల్లో నిలిచిపోవడం చాలా అరుదు. చిన్న శ్రీను గారు అది సాధించారు.జనంలో ఆయనకు ఉన్న స్థానం, ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలు చూసినప్పుడు, నిజమైన నాయకుడు ప్రజలలోనే జీవిస్తాడనే వాస్తవం మరోసారి నిరూపితమైంది.
ఈ సందర్బంగా తనకు అండగా నిలుస్తున్న ప్రజానీకానికి, తన కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్న వారికి చిన్న శ్రీను గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. నిజమైన నాయకునికి ప్రజలే బలమైన ఆయుధం, ప్రజలే ఆయుష్షు. ఈ ప్రేమాభిమానాలే చిన్న శ్రీను గారి రాజకీయ ప్రయాణానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి.
ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు,మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్న దొర, బూడి ముత్యాలు నాయుడు,శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి, ధర్మాన కృష్ణ దాస్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, మాజీ మంత్రివర్యులు మరియు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, విశాఖపట్నం జడ్పీ చైర్మన్ శ్రీమతి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, శంబంగి వెంకట చిన్నఅప్పల నాయుడు,పేట్ల ఉమాశంకర్ గణేష్, అదీపురాజ్,కంబాల జోగులు,కడుబండి శ్రీనివాసరావు,గొర్ల కిరణ్ కుమార్, నిమ్మకు జయరాజు,శ్రీమతి విశ్వసరాయి కళావతి,తిప్పల నాగిరెడ్డి, తిప్పల దేవాన్ రెడ్డి, బడ్డుకొండ అప్పలనాయుడు, తలారి వెంకట్రావు, కొట్టుగుల్ల భాగ్యలక్ష్మి,రాజాం అసెంబ్లీ ఇంచార్జ్ డా.రాజేష్ తలే, మన్యం జిల్లా YSR పార్టీ అధ్యక్షులు శత్రుసర్ల పరీక్షిత్ రాజు, శాసన మండలి సభ్యులు పెనుమత్స సురేష్ బాబు, అనంత బాబు,పాలవలస విక్రాంత్, ఇందుకూరి రఘురాజు,మాజీ ఎమ్మెల్సీ పి.వి.మాధవ్, పాకలపాటి రఘువర్మ, విజయనగరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరిచర్ల బాబుజి నాయుడు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్ మోహన్ రావు,మాజీ ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), గోడ్డేటి మాధవి, మాజీ విజయనగరం జడ్పీ చైర్మన్ స్వాతిరాణి,ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు చైర్మన్ పాలవలస యశస్విని మరియు మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, జిల్లా పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ హాజరై కీర్తి శేషులు ఆదిత్య ప్రణీత్ బాబుకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఇలా ప్రముఖులు రాకతో జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి కార్యకర్తల తాకిడితో మెట్రో కన్వెన్షన్ జనసముద్రంగా మారింది.