16/07/2025
స్కూల్ ఫీజు వసూలు కోసం పసి పిల్లలను అవమానిస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం...
వరంగల్: పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదగాలని అప్పో, సొప్పో చేసి మరీ లక్షల్లో ఫీజులు కట్టి స్కూళ్లకు పంపుతుంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల బలహీనతను క్యాష్ చేసుకునేందుకు రకరకాల పేర్లతో లక్షల్లో దండుకుంటున్నాయి ప్రైవేట్ స్కూళ్ళు అడ్మిషన్ టైంలో సాంప్రదాయినీ. సుద్దపూసని అన్నట్లు వ్యవహరించే స్కూల్ యాజమాన్యాలు, ఒక్కసారి పిల్లలను స్కూల్లో చేర్చాక అసలు రూపం బయటపెడుతుంటాయి. స్కూల్ ఫీజు వసూలు చేయటం కోసం లోన్ రికవరీ ఏజెంట్ల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు.
పసి పిల్లల స్కూల్ ఫీజు కట్టడం ఆలస్యమైనందుకు పిల్లలను క్లాస్ రూమ్ లో ఫస్ట్ యూనిట్ టెస్టు కోసం యాజమాన్యం ఒక హాల్ టికెట్ తయారు చేసి, ఫీజు కట్టిన తోటి పిల్లలకు హాల్ టికెట్లు ఇస్తూ, కట్టని పిల్లలకు హాల్ టికెట్లు ఇవ్వకుండా వారి మనసులను అవమానకరంగా, మనోవేదనకు గురి చేస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఫీజు కట్టడం ఆలస్యమైతే తల్లిదండ్రులను పిలిపించి ఆడగాలే తప్ప.. అందరి ముందు పిల్లలను ఇంతలా అవమానిస్తారా.? అంటూ స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు..
సర్కార్ బడుల్లో సకల సౌకర్యాలు ఉన్నా తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లపై ఆసక్తి చూపుతూ మోయలేని ఆర్థిక భారంతో నలిగిపోతున్నారు. తనిఖీలు చేయాల్సిన విద్యా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నైనా అధికారులు నిద్ర లేచి స్కూల్ లో తనిఖీలు చేయాలని కోరుతున్నారు... ఈ విషయమై తల్లిదండ్రులు మానవహక్కుల కమిషన్ కి సమాచారం ఇచ్చారు...
మనోభావాలు దెబ్బతింటే...
పాఠశాలలో తోటి విద్యార్థుల ముందుగానే ఫీజు చెల్లించిన వారికి హాల్ టికెట్లు ఇస్తూ, ఫీజు చెల్లించలేని విద్యార్థులను అవమానకరంగా అందరి ముందు హాల్ టికెట్లు ఇవ్వకుండా, స్కూల్ బస్సు ఎక్కనివ్వమని, పరీక్షలు రాయనీయ్యము అని పిల్లమను బెదిరిస్తే విద్యార్థుల మనోభావాలు దెబ్బ తిని, బాధలో ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే భాద్యులు ఎవ్వరిని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. పరీక్షలో ఫెయిల్ అయ్యమని, ఉపాధ్యాయులు మందలించారని విద్యార్థులు పాల్పడుతున్న అఘాయిత్యాలను టీవీల్లో, వార్తల్లో చూస్తూనే ఉన్నామని వారి ఆవేదనను వెలిబుచ్చారు.
DPS Warangal