09/08/2022
◆ వేల పసిగుండెలకు ప్రాణం పోసిన శ్రీమంతుడు మహేష్ బాబు
◆ ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు 47వ జన్మదిన వేడుకలు
◆ శ్రీమంతుడు 245 రోజులు ఆడిన ఎమ్మిగనూరు లక్ష్మణ్ థియేటర్ లో వేడుకలు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
#ఎమ్మిగనూరు : వేల పసిగుండెలకు ప్రాణం పోసిన శ్రీమంతుడు మహేష్ బాబు ఒక్కరే అని గర్వంగా చెబుతున్నట్లు సూపర్ స్టార్ కృష్ణ-మహేష్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఫ్యాన్స్ అధ్యక్షుడు వహాబ్, సీనియర్ ఫ్యాన్స్ నాయకులు ఎం.ఎస్.వాసు లు అన్నారు. #కర్నూలు జిల్లా #ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక లక్ష్మణ్ థియేటర్ నందు మహేష్ బాబు 47వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం థియేటర్ లో పనిచేసే కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రెండువేల ఐదువందలకు పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్న మహోన్నత వ్యక్తి మహేష్ బాబు అన్నారు.ప్రతి మూవీలో సామాజిక సేవను చర్చించే స్టార్ హీరోగా ఎదిగారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారన్నారు. #ప్రపంచ #మహేష్_బాబు చిత్రాల్లో హైఎస్ట్ డేస్ ఆడిన #శ్రీమంతుడు 245 రోజులు 4 ఆటలతో డైరెక్ట్ గా ఆడిన #ఎమ్మిగనూరులక్ష్మణ్ థియేటర్ లో వేడుకలు జరుపుకోవడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో థియేటర్ యజమానులు శ్రీధర్, రాము, అభిమానులు పరమేష్, ఆనంద్, ఖయ్యుం, శ్రీనివాసులు, మధు, వెంకటేష్, జితేంద్ర, చైతన్య, సుమేద్, తారక్ తదితరులు పాల్గొన్నారు.