14/08/2024
మగవాడి బాధలు మౌనరాగాల మూగ గీతాలు
గుండెలు పెక్కటిల్లే నిశ్శబ్దాలు పల్లవి,
మనసు కార్చే రక్త ధారల మౌనం అనుపల్లవి,
విశ్వమంత ఒంటరితనపు శూన్యం లో వినిపించని ఓంకారం చరణం,
నిరాశ నిస్పృహలు స్వరాలు, ఏకాంత రాగం, వేదన తాళం.............
వాడి బాధ, ఎప్పటికీ ప్రసవించని పురిటినొప్పి.