05/08/2022
ప్రపంచ వ్యాప్తంగా 24 రోజుల్లోనే రూ. 558.10 కోట్లు షేర్‌తో పాటు రూ. 1130.20 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ వసూళ్లని`కేజీఎఫ్-2`బ్రేక్ చేసింది. 'ఆర్ఆర్ఆర్`ఫుల్ రన్ లో ఇండియాలో 904 కోట్లు వసూల్ చేసింది. దీంతో `ఆర్ ఆర్ ఆర్` వసూళ్లని `కేజీఎఫ్-2` కొట్టడం కష్టమని.. దరి దాపుల్లో కూడా రాలేదని.. మహా అయితే 700-800 కోట్లతో అకౌంట్ క్లోజ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు సైతం భావించాయి. కానీ వాటన్నింటిని `కేజీఎఫ్` బ్రేక్ చేసింది. ఇండియాలో `కేజీఎఫ్` 930 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డుని లిఖించింది. స్థూలంగా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే `ఆర్ ఆర్ ఆర్` 1127 కోట్ల వసూళ్లని సాధించింది. ఇప్పటివరకూ `కేజీఎఫ్` 1107 కోట్లు వసూళ్లు సాధించి 20 కోట్ల వసూళ్లలో వెనుకబడి ఉంది. అయితే రెండు..మూడు రోజుల్లో బ్యాలెన్స్ 20 కోట్లు వసూల్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.